చిచ్చ గా దుమ్ము రేపుతున్న రాహుల్ సిప్లిగంజ్

chicha movie poster : టాలీవుడ్ లో డిఫరెంట్ తెలుగు సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్న రాహుల్, త్వరలో హీరోగా వేడి తెరపై మనముందుకు రాబోతున్నాడు. తెలంగాణ యాసలో రాహుల్ పాడే పాటకు తెలుగు ప్రజలు ఫిదా అవుతారు. అలాగే టాలీవుడ్ లో ఎన్నో అద్భుతమైన పాటలు పడుతూ.. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేస్తారు.
ఇతడు బిగ్ బాస్ 3 విన్నర్ గా గెలిచినా విషయం అందరికి తెలిసిందే… ఇపుడు సింగర్ గానే కాకుండా బిజినెస్ మ్యాన్ గాను అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఊకో కాకా అనే మెన్స్ వేర్ బ్రాండ్ స్టోర్ ను ప్రారంభించాడు. ఈ సందర్బంగా రాహుల్ సిప్లిగంజ్ అతని మిత్రుడు శ్రీకాంత్ ఇద్దరు కలిసి క్రియేట్ చేసిన ‘ఊకో కాకా’ (మెన్స్ వేర్) బ్రాండ్ స్టోర్ ని సిద్ధిపేట లో ప్రారంభించారు. ఈ స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
‘మల్లిక్ కందుకూరి’ దర్శకత్వంలో రాహుల్ సిప్లిగంజ్ హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘చిచ్చా’. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా టైటిల్, మోషన్ పోస్టర్ ని కూడా మంత్రి ‘టి. హరీష్ రావు’ సిద్దిపేట లో విడుదల చేసారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేసారు.
ఇంకా సిద్దిపేటలో షూటింగ్ చేయడానికి ఎన్నో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని తెలిపారు. అలాగే కళాకారులూ కూడా సిద్దిపేటలో ఉన్నారని వారికీ కూడా వీలైతే అవకాశం కల్పించండి అని కోరాడు. రాహుల్ ఇండస్ట్రీ లో ఒక స్టార్ గా ఎదగాలని ఆశిర్వదిస్తున్నానని తెలిపాడు.