Chiranjeevi Corona Positive: చిరంజీవికి వచ్చిన కరోనా వల్ల ఆ …. మూడు సినిమాలు ఆగనున్నాయా !

ఈటీవిల మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు నిబంధనల ప్రకారం కరోనా టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలడంతో సినీలోకం మొత్తం షాక్ కు గురి అయింది .
మెగాస్టార్ కి పాజిటివ్ వచ్చిన, నాకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, ప్రస్తుతం ఆరోగ్యాంగా హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నానని, దయచేసి నన్ను కలిసినవారు కరోనా టెస్ట్ చేయించుకోవాలని కోరాడు.
ఎప్పటికప్పుడు నా ఆరోగ్యం విషయం పై ప్రకటన విడుదలచేస్తానని తెలిపాడు.
రాజకీయంగా కూడా ఇది పెద్ద దుమారంలేపుతుంది. ఎందుకంటే చిరంజీవి ఈ మధ్యనే సీఎం ని కలవడంతో కె సి ఆర్ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండే పరిస్థితి నెలకొంది. అలాగే నాగార్జున కూడా చిరంజీవితో కలిసి సీఎం క్యాంపు ఆఫిస్ కి ఒకే కార్లో కలసివెళ్లడంతో నాగ్ కూడా హోమ్ క్వారంటైన్ వెళ్లే పరిస్థితి వచ్చింది.
అలాగే చిరు, రాంచరణ్,నాగార్జున నటించే సినిమాలు వరుసగా ఆగిపోనున్నాయి అని సినీవర్గాలలో చర్చ జరుగుతుంది.