Tollywood news in telugu
Chiranjeevi: చిరంజీవి తన తండ్రి వెంకట్రావ్ తో కలిసి చేసిన సినిమా !

చిరంజీవి తన కుమారుడు రామ్ చరన్ తో ‘ఖైదీ నంబర్ 150’ అలాగే ‘బ్రూస్లీ ‘ సినిమాలో ఇద్దరు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పడు వీరిద్దరూ కలిసి పూర్తీ నిడివి ఉన్న పాత్రలను ‘ఆచార్య ‘ సినిమాలో చేస్తున్నారు. ఈ సినిమాని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.
అదేవిదంగా చిరంజీవి, కొడుకుతోనే కాకుండా తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబులతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమాలో మెగాస్టార్ కనిపించాడు .
ఇదంతా ఒకవైపు ఐతే చిరంజీవి తన తండ్రి వెంకట్రావ్ తో కలిసి కూడా నటించాడు. ఆ సినిమానే ‘ మంత్రిగారి వియ్యంకుడు ‘ ఈ సినిమానకి బాపు దర్శకత్వం వహించాడు. చిరంజీవి సినిమాలోకి రాకముందు వెంకట్రావ్ గారు ‘జగత్ కిలాడి ‘ అనే సినిమాలో కూడా నటించారు.