Tollywood news in telugu

చిరంజీవి vs బాలకృష్ణ సంక్రాంతి కి పోటీ పడి ఎక్కువ ఎవరు గెలిచారో తెలుసా

chiranjeevi vs balakrishna : తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సెంటిమెంట్ ఉంది…. ఏమైనా చిత్రాలను సంక్రాంతికి విడుదల చేస్తే బ్లాక్ బస్టర్ హిట్టవుతుందని పలువురు నమ్ముతారు.. ఈ మేరకు పెద్ద పెద్ద అగ్ర హీరోల సినిమాలో ఈ సంక్రాంతి పండక్కి భారీ విజయాలు సాధించాయి.. అందులో ముఖ్యంగా టాలీవుడ్ లో అగ్ర హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, యువరత్న బాలకృష్ణ సినిమాలు భారీ హిట్స్ అందుకున్నాయి… అవి ఏ సినిమాలో తెలుసుకుందాం..

  1. ఆత్మబలం vs చట్టంతో పోరాటం :

1985 సం||లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో బాల‌కృష్ణ‌ హీరోగా నటించిన “ఆత్మబలం” భారీ హిట్ సాధించలేకపోయింది… అలాగే చిరంజీవి హీరో గా నటించిన “చట్టంతో పోరాటం” మంచి సక్సెస్ నే ఇచ్చిందన్ని చెప్పవచ్చు…

2.భార్గవ రాముడు – దొంగ మొగుడు :

1987 సం||లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో బాల‌కృష్ణ‌ హీరోగా నటించిన “భార్గవ రాముడు” చిత్రం యావరేజ్ గా ఆడింది… గతంలో వచ్చిన చట్టంతో పోరాటం సినిమా డైరెక్టర్ తోనే దొంగ మొగుడు చిత్రంలో చిత్రంలో మెగా స్టార్ హీరో నటించగా… ఆ చిత్రం భారీ హిట్ సాధించింది

3.ఇన్ స్పెక్టర్ ప్రతాప్ – మంచిదొంగ :

1988 సం||లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన “ఇన్ స్పెక్టర్ ప్రతాప్” చిత్రం ప్రేక్షకులను నిరాశపరచింది.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన “మంచి దొంగ” హిట్ అయింది…

4.పెద్దన్నయ్య – హిట్లర్ :

1997 సం||లో సంక్రాంతి పండుగ సంద‌ర్భంలో..ఈ సారి ఇద్దరు హీరోల చిత్రాలు భారీ విజయాన్ని సాధించాయి….పెద్దన్నయ్య చిత్రంలో లో బాలకృష్ణ చేసిన డబల్ రొల్ ప్రేక్షకులకు పిచ్చ పిచ్చగా నచ్చేసింది.. అలాగే హిట్లర్ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి

ఆ తర్వాత సంక్రాంతికి వచ్చిన…బాలకృష్ణ చిత్రాలు వంశోద్ధారకుడు, నరసింహ నాయుడు, సహా పలు చిత్రాలు బాలయ్యకు సంతృప్తినిచ్చాయి… చిరంజీవి నటించిన అన్నయ్య, మృగరాజు సహా పలు చిత్రాలు మెగాస్టార్ కి మైలురాయిగా మిగిలిపోయాయి….

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button