Chiru and Nag multi starrer : చిరు నాగార్జున ముల్టీస్టారర్ కి సర్వం సిద్ధం :-

Chiru and Nag Multi Starrer : మీరు చదివింది నిజమే. మొట్ట మొదటి సారి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవ్వరు ఊహించని కాంబినేషన్ కి సర్వం సిద్ధం అయింది. మెగా స్టార్ చిరంజీవి మరియు అక్కినేని నాగార్జున కలిసి చేయన్నున భారీ లెవెల్ ముల్టీస్టారర్ సినిమా కి సంబందించిన పనులు సర్వం సిద్ధం.
ఇండస్ట్రీ లో ఎప్పటినుంచో చిరు మరియు నాగ్ కలిసి నటించాలని అనుకున్న విషయం అందరికి తెలిసిందే. ఎప్పటినుంచో వీరు కంటున్నా కల ఇన్నాళ్లకి నెరవేరుతుంది.
మ్యాటర్ లోకి వెళ్తే చిరు, నాగార్జున కలిసి భారీ లెవెల్ లో ముల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారని తెలిసింది. ఈ సినిమా మరేదో కాదు. తమిళ బ్లాక్ బస్టర్ అయినా విక్రమ వేద అనే సినిమా.
ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు అనుకుంట. విక్రమ వేద లో విజయ్ సేతుపతి మరియు మాధవన్ కలిసి చేసిన పెర్ఫార్మన్స్ అంత ఇంత కాదు. ఈ సినిమా నీ భాషతో సంబంధం లేకుండా ప్రతిఒక్కరు చూసి ప్రశంసల వర్షం కూడా కురిపించారు.
అయితే ఇపుడు చిరు నాగ్ కలిసి ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేయాలనీ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. ఇంకా ఈ మ్యాటర్ పైన అధికారిక ప్రకటన చేయకపోయినా ఇపుడు చిత్రసీమ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. చిరు మరియు నాగ్ విక్రమ వేద రీమేక్ లో ఎవరు, ఎవరి పాత్రా చేయబోతున్నారో తెలియదు కానీ.. ఇదే కనుక నిజం అయితే ఎన్నడూ లేను మాస్ ఎంటర్టైనర్ అఫ్ ఇండస్ట్రీ అవుతుంది అన్న విషయం లో ఎటువంటి సందేహం లేదు. చూడాలి మరి ఈ కాంబినేషన్ గురించి ఇంకా ఎలాంటి అప్ డేట్స్ రాబోతున్నాయి.