Chiru and Raviteja Deadly Combination : మెగాస్టార్ చిరంజీవి తో మాస్ మహారాజ రవితేజ ముల్టీస్టారర్ సినిమా ?:-

Chiru and Raviteja Deadly Combination : హెడ్డింగ్ చదవగానే చాల ఆనందం వేసింది కదా. మాకు కూడా. మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేయడం, అన్ని ఒకేసారి షూటింగ్స్ కూడా మొదలుపెట్టడం జరిగిపోయాయి. ఆచార్య సినిమా ఒకటి షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అయింది. దీని తర్వాత చిరు గాడ్ ఫాదర్ , భోళా శంకర్ సినిమాలతో బిజీ అయ్యారు.
అయితే చిరు పుట్టిన రోజు సందర్బంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు చిరు తో సినిమా చేయబోతున్నారని ఆ సినిమాకి దర్శకుడు బాబీ అని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. కానీ ఈ సినిమా కి సంబందించిన పోస్టర్ చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేశారు. ఆ పోస్టర్ చూడగానే అభిమానులు చిరు ముందు ఈ సినిమా చేస్తే బాగుండు ఆనెంతల ఆకట్టుకుంది.
మ్యాటర్ లోకి వెళ్తే చిరు బాబీ కలిసి చేయబోయే సినిమా ముల్టీస్టారర్ అని చిత్రసీమలో టాక్ విపరీతంగా నడుస్తుంది. ఈ సినిమాలో చిరుకి పోటీగా సెట్ అయ్యే హీరో ఎవరా అని ఆలోచించగా మాస్ మహారాజ అయితే పర్ఫెక్ట్ అని చిత్ర బృందానికి అనిపించిందట. వెంటనే రవి గారికి కాల్ చేసి ఈ విషయం గురించి చర్చించారని , రవి గారు కూడా అంగీకరించారు అనే వార్తలు టాక్ అఫ్ ది టౌన్ గా వినిపిస్తున్నాయి.
ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీ లో మాత్రం ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనా చిరు మరియు రవితేజ కలిసి నటిస్తే ఆన్ స్క్రీన్ లో అభిమానులకు పూనకాలే మరి. చూడాలి మరి ఈ విషయం పై చిత్ర బృందం ఏ విధంగా రెస్పాండ్ అవుతారో , అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో మరి.