అరుదుగా దొరికేది క్లీనింగ్ ఫిష్:-

cleaning fish in telugu :: ఎలుక మూతి ఆకారంలో ఉండి , తినడానికి పెద్దగా ఎవరూ ఈ ఫిష్ ని ఇష్ట పడకపోయిన,చిన్నగా ఉండి కొంత గంభీరంగా ఉండటం తో ,ఈ రకం చేపలకు ‘దెయ్యంబేరు’ అని పేరు పెట్టారు.
ఈ రకానికి చెందిన చేప ఎక్కడ నాచు, పాచి కనిపించిందా ఊరుకోదట దాన్ని శుభ్రం చేసేదాకా అస్సలు కదలదట అందుకే దీన్ని క్లీనింగ్ ఫిష్ అని కూడా అంటారు.
ఖమ్మం జిల్లాకు చెందిన డేగల వీరయ్య అనే వ్యక్తి కి నరిసింహులుగూడెంలోని ఓ చెరువులో ఈ రకం చేప తన చేతికి చిక్కడం తో ,పాలేరు మత్స్య పరిశోధనా కేంద్రంలో దీన్ని అప్పగించారు.
ఖమ్మం జిల్లా ప్రతినిధి మత్స్య పరిశోధనా కేంద్రం ప్రధాన సైంటిస్ట్ డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి గారు మాట్లాడుతూ “దెయ్యంబేరు”గా పిలుచుకునే ఈ రకం చేపలు దాదాపుగా వలకు దొరకవన్నారు. చెరువులు, లేద రిజర్వాయర్లలోని లోతైన ప్రాంతాల్లో వాటికి ఆహారం దొరికే ప్రదేశాలను ఎంపిక చేసుకుంటాయన్నారు.
వీటిలో మాంసం తక్కువ, ఎముకలు ఎక్కువగా ఉండడం వల్ల తినడానికి ఎవరు ఇష్ట పడరని , వీటిని అక్వేరియంలలో పెంచుకోవడం వలన అందులోని నాచు ను శుభ్రం చేస్తుందని ఈ సందర్బంగా తెలియజేసారు.