Tollywood news in telugu

Collage kumar movie teaser launched in a grand way !!!

కాలేజ్ కుమార్ టీజర్ లాంచ్

ఎమ్ ఆర్ పిక్చర్స్ పతాకంపై లక్ష్మణ్ గౌడా సమర్సణ లో ఎల్ పద్మనాభ నిర్మించిన చిత్రం కాలేజ్ కుమార్. కన్నడ ఘన విజయం సాధించిన ఈ
మూవీ తో తెలుగు లో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు హారి సంతోష్. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని హీరో, హీరోయిన్లుగా
నటిస్తున్న ఈ మూవీ లో నట కిరీటి రాజంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లాంచ్ నిర్మాత పద్మనాభ గారి ఆత్మీయురాలు రేఖ గారి చేతులు మీదుగా జరిగింది. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా
స్టంట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ:
‘‘ ఈ కథ వినగానే నాకు మంచి నమ్మకం కలిగింది. మా అబ్బాయి రాహుల్ విజయ్ తో పాటు ఇందులో పనిచేసిన అందరికీ మంచి పేరు
రావాలి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను, ఈ సినిమా లో నాకు పనిచేసే అవకాశం కల్పించిన నిర్మాత, దర్శకులకు
థ్యాంక్స్ ’’ అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ నార్ల మాట్లాడుతూ: ‘‘ కన్నడ హిట్ అయిన కాలేజ్ కుమార్ ని తెలుగు లో నిర్మించాం. ఇక్కడ కూడా ఘన
విజయం సాధించాలని కోరుకుంటున్నాను. రాహుల్ ఈ సినిమా తో మంచి రేంజ్ లోకి రావాలని ఆకాంక్షింస్తున్నాను’’ అన్నారు.

హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడతూ: ‘‘ఈ సినిమా కథ వినగానే బాగా ఇంప్రెస్ అయ్యాను. రాజేంద్ర ప్రసాద్ వంటి నటులతో కలసి
పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీ అందరికీ నచ్చే ఎలిమెంట్స్ ఈ మూవీ లో చాలా ఉన్నాయి. మీ సపోర్ట్ మాకు ఉంటుందని
నమ్ముతున్నాను ’’ అన్నారు.

ప్రొడ్యూసర్: ఎల్ పద్మనాభ మాట్లాడుతూ : ‘‘ ఈ సినిమా తో తెలుగులో నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి టీం తో
పనిచేసాము. మా సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎంటర్ టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా మంచి కథను
అందించాము, ప్లీజ్ సపోర్ట్ కాలేజ్ కుమార్’’ అన్నారు.

డైరెక్టర్ హారి సంతోష్ మాట్లాడుతూ: ‘‘ దర్శకుడిగా నాకు ఇది ఎనిమిదో సినిమా, కాలేజ్ కుమార్ కన్నడంలో పెద్ద విజయం అందుకున్నాక
ఇదే కథను తెలుగు తెరమీదకు రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ పద్మనాధ గారు. నా సినిమాకు పనిచేస్తున్నప్పుడు స్టంట్ మాస్టర్ విజయ్
గారి దగ్గర రాహుల్ పిక్స్ చూసాను అప్పుడే ఈ కథ కు అతడే హీరో అని పిక్స్ అయ్యాను. రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయడం ఒక
మెమరబుల్ ఎక్స్ పీరియన్స్. తెలుగు పరిశ్రమ లో పనిచేయడం నాకు చాలా కంపర్టబుల్ గా ఉంది. అంతే కాదు చాలా నేర్చుకున్నాను. టీజర్
తర్వాత సాంగ్స్ ఒన్ బై ఒన్ విడుదల చేస్తాము. ఒక మంచి టీం తో పనిచేసాను , సినిమా తప్పకుండా మీకు నచ్చుతుంది అని
నమ్మతున్నాను’’ అన్నారు.

బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ: ‘‘ కాలేజ్ కుమార్ గురించి యేడాదిన్నర క్రితమే విన్నాను. ఈ సినిమా తో తెలుగులో రాహుల్ ,
రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషనల్ వస్తుందనగానే చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాను. ప్రొడక్షన్ ని చాలా ప్లాన్డ్ గా చేసారు.
కన్నడలో విజయంసాధించినట్లు తెలుగు లో కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ’’ అన్నారు.

హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ: ‘‘ ప్రతి కొడుక్కి హీరో వాళ్ళ నాన్నే. ఆయన్ను చూస్తూనే పెరుగుతాం.. ఆయన భుజాల మీదనుండే ప్రపంచాన్ని చూస్తాం. అందుకే ఈ కథకు నాకు ఒక పర్సనల్ ఎమోషన్ గా మారింది. శశికుమార్ అనే ఫాదర్ శివకుమార్ అనే కొడుక్కి నేల మీద నిలబడి సొసైటి ని చూడటం నేర్పిస్తాడు.. ఆ క్రమంలో వారద్దరి మద్య జరిగే కథ కాలేజ్ కుమార్. రాజేంద్ర ప్రసాద్ గారితో కలసి పనిచేయడం ఒక లెర్నింగ్ అలాంటి అవకాశం నాకు దొరకండం నా అదృష్టం. తప్పకుండా మా టీజర్ మీకు నచ్చుతుందని నమ్ముతున్నాను. ప్రియగారి తో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది.’’ అన్నారు.

నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ: ‘‘ కాలేజ్ కుమార్ కాలేజ్ కి వెళ్ళేది నేనే. ఇంతకు మించి కథ నన్ను అడగొద్దు.. ఇప్పటి వరకూ నా మనసుకు నచ్చిన కథల్లో ఈ కథ ఒకటి. కథా బలం ఉండి దాన్ని ఎంటర్ టైన్మెంట్ గా చెప్పగలిగితే అది ప్రేక్షకులకు బాగా చేరవవుతుంది. ఈకథకు ఆ లక్షణాలు చాలా ఉన్నాయి.. ఈ సినిమా లో నవ్వుతూనే ..నవ్వుతూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచిస్తారు. ఈ సినిమా విషయంలో నేను బాధ్యత తీసుకుంటాను. ఎక్కడి వారయినా అక్కున చేర్చుకునే గుణం తెలుగు పరిశ్రకు ఉంది నిర్మాత పద్మనాభ, కి దర్శకుడు హార సంతోష్ కి తెలుగు పరిశ్రమ తరపున నేను స్వాగతం చెబుతున్నాను. నాతో పాటు నటించిన మధుబాల నటన కూడా చాలా అద్బుతంగా ఉంటుంది. రాహుల్ కి నాకు మద్య కెమిస్ట్రీ చూసి రాహుల్ తండ్రి విజయ్ కి జెలసీ వస్తుంది. అంత బాగా మా కాంబినేషన్ కుదిరింది. కథా బలంతో పాటు ఎక్కడా ఎంటర్ టైన్మెంట్ తగ్గకుండా అందరినీ ఆలోచిప జేసే చిత్రంగా కాలేజ్ కుమార్ నిలుస్తుంది’’ అన్నారు.

బ్యానర్: ఎమ్ ఆర్ పిక్చర్స్.
సమర్పణ: లక్ష్మణ గౌడ,
ప్రొడ్యూసర్: ఎల్. పద్మనాభ
డైరెక్టర్: హారి సంతోష్
డిఓపి: గురు ప్రశాంత్ రాజ్
మ్యూజిక్: కుతుబ్ ఇ క్రిప
ఎడిటర్: గ్యారీ బి. హెచ్. పవన్ కుమార్
స్టంట్స్: విజయ్
పిఆర్ ఓ: జియస్ కె మీడియా
డైలాగ్స్: సందీప్ రాజ్

నటీ నటులు: రాహుల్ విజయ్ , ప్రియ వడ్లమాని, రాజేంద్ర ప్రసాద్ , మధుబాల తదితరులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button