సినిమా :- కలర్ ఫోటో (2020)

Color Photo: సినిమా :- కలర్ ఫోటో (2020)
నటీనటులు :- సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష
మ్యూజిక్ డైరెక్టర్:- కాలా భైరవ
నిర్మాతలు :- సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పనేని
డైరెక్టర్ :- సందీప్ రాజ్
కథ:-
ఈ కథ జయకృష్ణ (సుహాస్ ) ని వివరిస్తూ మొదలవుతుంది. అతని రంగు వలన తాను ప్రేమించిన అమ్మాయితో ధైర్యంగా ప్రేమ విషయం చేపలేకపోతాడు. తాను ప్రేమించిన అమ్మాయి దీపు (చాందిని చౌదరి). జయకృష్ణ దీపు ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేసాడు కానీ ప్రేమ విషయం చెప్పాలంటే భయపడేవాడు. ఈ సందర్భం లో అనుకోకుండా తాను చదివే కాలేజీలో ఒక గ్యాంగ్ అతని కొట్టడం ఆ విషయం దీపు కి తెలియడం వాలా వారిద్దరి మధ్య స్నేహం తో మొదలయి ప్రేమ అనే పదానికి తెరలేపుతుంది. ఇదిలా ఉండగా దీపు వాలా అన్నయ్యా రామరాజు (సునీల్) కి నచ్చకపోవడం తో గొడవలు మొదలవుతాయి. అసలు రామరాజు (సునీల్) ని జయకృష్ణ ఎలా ఒపించాడు? చివరికి వారి ప్రేమ విఫలం అవుతుందా ? తెలుసుకోవాలంటే ఈ సినిమా ఆహ లో చూసేయాల్సిందే…
* నటన పరంగా సుహాస్ హీరో గా తనకి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడ తగ్గకుండా సినిమాని తన భుజం పైన మోసి ఎన్నో వేరియేషన్స్ తో ప్రేక్షకులని కనువిందు చేసాడు. హీరోయిన్ చాందిని చౌదరి కూడా చాల బాగా నటించింది.
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా వివరించారు.
* కథ మరియు కథనం చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* సినిమా అక్కడక్కడా నిదానంగా సాగుతుంది.
ముగింపు :-
కలర్ ఫోటో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే ఒక చక్కటి ప్రేమ కథ. ఈ కథ ని దర్శకుడు అంతే చక్కగా కంటతడి పేటించేరూపం లో చిత్రీకరించి ప్రేక్షకాదరణ పొందడం లో ఘనవిజయం సాధించాడని చెప్పచు. నటన పరంగా సుహాస్ హీరో గా తనకి ఇది మొదటి సినిమా అయినా ఎక్కడ తగ్గకుండా సినిమాని తన భుజం పైన మోసి ఎన్నో వేరియేషన్స్ తో ప్రేక్షకులని కనువిందు చేసాడు. హీరోయిన్ చాందిని చౌదరి కూడా చాల బాగా నటించింది. సునీల్ విలన్ గా బాగా చేసాడు. మ్యూజిక్ సినిమాకి ప్రాణం పోసింది. కల భైరవ మ్యూజిక్ మరియు బాక్గ్రౌండ్ సినిమాని ఇంకోమెట్టు పైకి తీసుకొని వచ్చింది. నిర్మణ విలువలు బాగున్నాయి. సినెమాటోగ్రఫీ బాగుంది. మొత్తానికి కలర్ ఫోటో ఈ వరం కుటుంబ కథ చిత్రం గా మారింది అని చెప్పచు.
రేటింగ్ :- 2.75/5