technology information

వాట్సప్ లో ఫేక్ న్యూస్ ని గుర్తించడానికి త్వరలో రాబోతున్న కొత్త యాప్

మనం ఈ రోజల్లో ఎక్కువగా ఉపయోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ వాట్సప్ లో వచ్చే న్యూస్ ఏది వాస్తవం, ఏది నకిలీ న్యూస్ అనేది కనిపెట్టడం అసాధ్యం. దీని వల్ల జరిగిన ఘోరాలు ఎన్నో. వాట్సప్ లో వచ్చిన పుకార్ల కారణంగా మహారాష్ట్రలోని రైన్ పడ గ్రామంలో పిల్లలను ఎత్తుకుపోయేవారనే అనుమానంతో ఐదుగురు వ్యక్తులు చంపబడ్డారు.ఇటీవలే కర్నాటకలోని బీదర్ సమీపంలో పిల్లలను ఎత్తుకుపోయేవారని అనుమానిoచి  ఒక ముఠా వారిపై దాడి చేయడం వల్ల  వారిలో ఒక వ్యక్తి  మరణించారు మరియు మరో ముగ్గురు గాయపడ్డారు. ఇలా ఈ మధ్యకాలంలో మనం చాలా సంఘటనలు చూసాము. వీటిని అరికట్టాలి అంటే ముందు మనకు వచ్చిన మెసేజ్ ఫేక్ అవునా కాదా అని తెలుసుకోవాలి.

ఢిల్లీలో ఒక  సంస్థలోని నిపుణుల బృందం వాట్సప్ లో వచ్చే మెసేజ్ ఫేక్ అవునా కాదా అని మనకు తెలియజేయగల ఒక అప్లికేషన్ ని అభివృద్ధి చేయడంలో పని చేస్తుంది. ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఢిల్లీలో (IIIT-D) కంప్యూటర్ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ పొన్నూరoగం కుమారగురు ఈ ఫ్లాట్ ఫార్మ్ పై సర్క్యులేట్ చేయబడిన ఒక మెసేజ్ యొక ప్రామాణికతను నిర్ణయించే యాప్ ని అభివృద్ధి చేస్తున్న టీం కి లీడర్ గా వ్యవహరిస్తున్నారు.

ఈ అప్లికేషన్, ప్రస్తుతo ఉన్న పరిస్థితుల్లో ఒక ఉపయోగకరమైన సాధనంగా ఉంటుందని ప్రొఫెసర్ చెప్తున్నారు. కేవలం వాట్సప్ లో సర్క్యులేట్ చేయబడిన పుకార్ల ఆధారంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని రిపోర్ట్స్ చెపుతున్నాయి. ఇది

“మేము పెద్ద సంఖ్యలో డేటాను సేకరిస్తున్నాము మరియు 9354325700 నంబర్ పై మాకు సందేశాలను పంపించమని ప్రజలను కోరాము. ఈ మేసేజెస్ ని విశ్లేషించి మరియు తదనుగుణంగా ఇటువంటి మెసేజెస్ పై ఒక వ్రాపర్ ఉంచడానికి మేము ఒక మోడల్ ని  అభివృద్ధి చేస్తాము” అని ఆయన చెప్పారు.

ఉదాహరణకు, ఒక వేళ ఒక మెసేజ్ ని రిసీవ్ చేసుకుంటే అది ఎటువంటి మెసేజ్ అని సూచించే కలర్ కోడ్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ అనేది ఆ మెసేజ్ చట్టబద్ధమైన కంటెంట్ అని సూచిస్తుంది, ఎల్లో కలర్ అనేది ఆ మెసేజ్ ని డీకోడ్ చేయలేకపోతుందని సూచిస్తుంది, అయితే ఇది ఖచ్చితంగా నకిలీ కంటెంట్ అని రెడ్ కలర్ సూచించవచ్చు.

ఈ టీం “అందుకున్న మెసేజెస్ ద్వారా, వారు అలాంటి మెసేజెస్ లలో కొన్ని కామన్ సాధారణ ఫ్యాక్టర్స్ ని గమనించారు. అవి ఒక  చిత్రం, ఒక URL లేదా కొన్ని పదాలు కావచ్చు. ఒకవేళ అది ఫార్వార్డ్ మెసేజ్ అయితే, అది ఫేక్ మెసేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అని “అని ప్రొఫెసర్ చెప్పారు.

కొన్ని నెలలలో ఈ యాప్ సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు. సో ఈ యాప్ త్వరగా అందుబాటులోకి రావాలి అని కోరుకుందాం.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button