Today Telugu News Updates

చచ్చిపోతున్నా నాన్నా అంటూ కరోనా పేషంట్ వీడియో, corona patient last words

చచ్చిపోతున్నా నాన్నా… ఆక్సిజన్ అడిగినా పెట్టడం లేదు .. వెంటిలేటర్ తీసేశారు ఊపిరి ఆగిపోయేలా ఉంది .. బై నాన్నా అంటూ corona patient last words ఎర్రగడ్డ చెస్ఆస్పత్రిలో కరోనా రోగి ఆఖరి మాటలు వీడియో చూసిన అందరికి కన్నీరు తెప్పించాయి .

కరోనా నియంత్రణకు , రోగులను కాపాడేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల అపశ్రుతులు దొర్లుతున్నాయి . ఆక్సిజన్ అందక ఓ రోగి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక సంఘటన హైదరాబాద్ నగరంలో ఎర్రగడ్డ చెస్ఆసుపత్రిలో చోటు చేసుకుంది . జవహర్‌నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు . వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు . అయితే ఆదివారం ఆయనకు పెట్టిన వెంటిలేటర్ తొలగించినట్లు బాధితుడు చేసిన ఆక్రందన అందరినీ కదిలించింది .

corona patient last words ::

watch the video:

హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ లో దారుణం…. వెంటిలేటర్ పీకేసిర్రు ఊపిరాడుతలేదంటుంటే కూడ పెడలేరు చచ్చి పోతున్న అందరికి బాయ్…

Posted by Telangana forum on Sunday, June 28, 2020

 ఆక్సిజన్ పెట్టండంటూ కోరినా ఎవరూ స్పందించకపోవడంతో మరణించాడు . తనకు ఊపిరి ఆడడం లేదని , వెంటిలేటర్ పెట్టమని బతిమలాడినా సిబ్బంది పట్టించుకోలేదని చనిపోయే ముందు సెల్ఫీ వీడియో ద్వారా ఆ యువకుడు కుటుంబ సభ్యులకు చెప్పాడు . ‘ మూడు గంటలపాటు బతిమలాడినా వెంటి లేటర్ పెట్టడం లేదు , డాడీ నాకు ఊపిరి ఆడడం లేదు . గుండె ఆగిపోయేలా ఉంది . ఊపిరి ఒక్కటే ఉంది . బైడాడీ … బై డాడీ ‘ అంటూ ప్రాణాలు వదిలాడు . చివరి క్షణంలో అందరికీ వీడ్కోలు చెబుతూ ప్రాణాలొదిన తీరు చూసి ప్రతి ఒక్కరూ కన్నీరుమున్నీరయ్యారు .

 ఈ వీడియో బయటకు రావడంతో ఆస్పత్రి వైద్య , సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి . కాగా దీనిపై ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ వివరణ ఇచ్చారు . వైద్యుల నిర్లక్ష్యం వల్ల , ఆక్సిజన్ అందకపోవడంవల్ల రవికుమార్ మరణించినట్లు వస్తున్న వార్తలను ఖండించారు . యువకులకు కరోనా సోకినప్పుడు వారి గుండెపై వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోందని , గుండె దెబ్బతిన్న తరువాత ఆక్సిజన్ పెట్టినా ప్రయోజనం ఉండదని వివరణ ఇచ్చారు . రవికుమార్ విషయంలోనూ అదే జరిగిందని చెప్పారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button