Today Telugu News Updates

తెలంగాణాలో కరోనా ప్రమాద ఘంటికలు, Corona +ve cases in Telangana

 తెలంగాణాలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మ్రోగిస్తోంది. Corona +ve cases in Telangana హైదరాబాద్ లో పరిస్థితి దారుణంగా మారింది . రాష్ట్రంలో నమోదు అవుతున్న అత్యధిక కే సులు జీహెచ్ఎంసీ నుంచే వస్తున్నాయి . హైదరాబాద్ అక్కడక్కడా కాదు నలుమూలలా కరోనా పంజా విసురుతోంది . దీంతో రోడ్లపై జన సంచారం బాగా తగ్గింది.

   కరోనా వైరస్ కారణంగా పరిస్తితి భయానకంగా మారింది . వైరస్ విస్తృతస్థాయిలో విస్తరిస్తున్నా .. నివారణకు గట్టి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడంలేదు . విస్తరణకు గల కారణాలను సైతం తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి . ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో పాజిటివ్ కేసలు పదులు , వందలు దాటి నేడు వేలల్లోకి వెళ్లింది . సోమారంనాడు ఒక్కరోజు హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో 1419 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మహానగరం ఒక్కసారి ఉలిక్కిపడింది . రోజు రోజుకు వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి . దీంతో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి .

Corona +ve cases in Telangana ::

 గత నెలలో లాక్ డౌన్ సడలింపులతో ప్రజలు ఇష్టానుసారంగా రోడ్లపైకి రావడం , ఉద్యోగులు విధులకు హాజరవడం , కార్మికులు పనుల్లో సామాజిక దూరం పాటించకపోవడం , గుంపులు గుంపులుగా గుమిగూడడం , దుకాణాల్లోకి ఎగబడడంతో కరోనా వైరస్ విస్తరణకు దోహదపడుతోంది . ఎవరి నుంచి వైరస్ విస్తరించిందని గుర్తించేవీలు లేకుండా పోయింది . గతంలో ఓ వ్యక్తికి వైరస్ అంటుకున్నదని తేలితే ఆయన ఎవరిని కలిశారు … ఎవరి నుంచి వ్యాపించిందంటూ ఉరుకులుపరుగులు పెట్టేవారు . నేడు ఆ పరిస్థితి లేదు . ఎవరి నుంచి వ్యాప్తి చెందింది కూడా గుర్తుపట్టడం కష్టంగా మారింది . రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం , అలాగే ఆటోలు , ఇతర వాహనాల్లో కెపాసిటీకి మించి ప్రయాణం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం నివారించడం లేదు . దీంతో కనబడని మహమ్మారి విస్తరిస్తోంది .

 కరోనా వ్యాధి విస్తరిస్తుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా , ముఖ్యంగా హైదరాబాద్ వాసులు బెంబే లెత్తుతున్నారు . కరోనా వ్యాధి విస్తృతస్థాయిలో విస్తరింస్తున్నందున లాక్ డౌన్ అమలు చేయాలంటూ వైద్యనిపుణులు ప్రభుత్వాన్ని కోరడం , దీన్ని పరిశీలిస్తామని , త్వరలోనే లాక్ డౌన్ ప్రకటించే వీలు లేకపోలేదంటూ సాక్షాత్తు   సీఎం కేసీఆర్ దానిపై ఇంత వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు . మరోసారి లాక్ డౌన్ విధిస్తారని ఇక పట్నంలో తమ బతుకుదెరువు లేదన్న నెపంతో లక్షలాదిమంది పేదలు హైదరాబాద్ నుంచి స్వంతూళ్లకు వెళ్లిపోయారు . కొంతమంది ఉద్యోగులు నగరంలో పరిస్థితి భయంకరంగా మారుతుండడంతో భార్యా పిల్లలను గ్రామాలకు పంపించి వేశారు . అయినా కూడా ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడం లేదంటూ నగర వాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు .

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button