కుక్కలు పీక్కుతింటున్న కరోనా శవాలు, Coronavirus dead body cremation

చనిపోయిన వారిని గౌరవించే గొప్ప సంస్కృతి మనది . అయితే Coronavirus dead body cremation కరోనా మహమ్మారితో చనిపోయిన వారిని కుటుంబ సభ్యులు చివరి చూపుకు కూడా నోచుకోవడం లేదు . అంత్యక్రియల నిర్వహణలోనూ దగ్గర ఉండలేని దుస్థితి . కరోనా సోకినా , ఆ వ్యాధితో మరణించినా అవస్థలు అంతా ఇంతా కావు , ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం , భయాందోళనల వల్ల కరోనా మృతులకు చివరికి అంతిమసంస్కారాలు సరిగా జరగడం లేదు .
ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కరోనా మృతులను సామూహిక ఖననం చేస్తున్న వీడియోలు కంతటడి పెట్టించాయి . అలాంటి సంఘటనే హైదరాబాద్ సనత్ నగర్ శ్మశానవాటికలో జరిగింది . కరోనాతో చనిపోతే మతదేహాలు పూర్తిగా కాలకుండానే వదిలేస్తుండటంతో శరీర భాగాలను కుక్కలు పీక్కుతింటున్న అమానవీయ ఘటన ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో చోటు చేసుకుంది .
Coronavirus dead body cremation ::
గాంధీ ఆసుపత్రిలో ఎవరైనా కరోనాతో చనిపోతే ఇఎస్ఐ సమీపంలోని సత్యహరిశ్చంద్ర శ్మశానవాటికలో దహనం చేస్తున్నారు . మృతుల వివరాల నమోదు , అంత్యక్రియల పర్యవేక్షణకు జిహెచ్ఎంసి ముగ్గురు సిబ్బందిని అక్కడ నియమించింది . అయితే మతదేహాలు పూర్తిగా కాలకుండా వదిలేస్తుండటం కలకలం సష్టిస్తోంది . తన తాత అస్థికల కోసం శ్మశానవాటికకు వచ్చిన ఓ వ్యక్తి అక్కడ సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటుండటంతో అవాక్కయ్యారు . ఈ దృశ్యాలను వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో వైరల్ అయ్యాయి .
కరోనా వైరస్ విజంభణతో కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రి అత్యవసర విభాగంలో బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది . ఐసియులో ఉండే రోగుల సంఖ్య ఆదివారం నాటికి 500 కు చేరుకుంది . వీరంతా ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు వైద్య వర్గాలు ధ్రువీకరించాయి . గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 850 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తుండగా , వీరిలో కరోనాతోపాటు వివిధ రుగ్మతలకు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమారు 500 మందిని ఐసియులకు తరలించి వెంటిలేటర్లపై ఉంచి చికిత్స అందిస్తున్నారు .
కిడ్నీ , లివర్ , ఆస్తమా , షుగర్ , బిపి , గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటుందని , అందుకే వీరిని ఐసియులో ఉంచి వైద్య సేవలు అందిస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు వెల్లడించారు . క్రిటికల్ పొజిషన్లో ఉన్నవారు కూడా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని , బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు , సిబ్బంది శక్తివంచన లేకుండా కషి చేస్తున్నారని తెలిపారు . ఐసిఎంఆర్ నిబంధనల ప్రకారం గాంధీ ఆస్పత్రిలో ఇప్పటివరకు తొమ్మిది మందికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించామని , వందశాతం సక్సెస్ సాధించామన్నారు . ప్లాస్మా చికిత్సతో కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులైన ఐదుగురిని డిశ్చార్జ్ చేశామని , మరో నలుగురు కోలుకుంటున్నారని , వారిని రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వివరించారు . మరో ఐదుగురికి ప్లాస్మాథెరపీ చికిత్సలు అందించేందుకు అవసరమైన ప్లాస్మాకణాలు గాంధీ బ్లడ్ బ్యాంకులో అందుబాటులో ఉన్నాయని , ఐసిఎంఆర్ ఆదేశాల మేరకు వాటిని వినియోగిస్తామన్నారు .