Tollywood news in telugu

సినిమా :- కరోనా వైరస్ (2020)

coronavirus movie review: first movie in the theatres after corona pandemic

సినిమా :- కరోనా వైరస్ (2020)
నటీనటులు :- శ్రీకాంత్ అయ్యంగార్, వమ్సీ చాగంటి, డోరా సాయి తేజ, సోనియా అకులా, దక్షి గుట్టికొండ
మ్యూజిక్ డైరెక్టర్:-  డి.ఎస్.ఆర్
నిర్మాత:- రామ్ గోపాల్ వర్మ

డైరెక్టర్ :- అగస్త్యా మంజు

కథ:-ఈ కథ ఒక ఇంట్లో అత్త మరియు కోడలు రాణి (దక్షిణా గుట్టికొండ) మధ్య జరిగే గొడవతో మొదలవుతుంది. ఓపిక సహించిపోయి రాణి తన తల్లిదండ్రుల దగ్గరకు తిరిగి వెళ్లిపోవాలని భర్తతో తన బాధను చెప్తున్నసమయంలో , ఇంటి పెద్ద అయినా (శ్రీకాంత్ అయ్యంగార్) టీవీ చూస్తుండగా అందులో కరోనా లాక్ డౌన్ గురించి మరియు దేశంలో ప్రభుత్వం నియమిస్తున్న ఆంక్షల గురించి వివరిస్తున్నారు. ఆ విషయం తెలుసుకొని  కుటుంబం అంత ఒకసారిగా షాక్ అవుతారు. అనుకోకుండా అదే సమయం లో రాణి వదిన అయినా శాంతి (సోనియా) అనారోగ్యానికి గురవుతుంది. ఈ సంగతి తెలుసుకున్న ఇంటి సభ్యులు మరింత భయపడుతారు. చివరికి ఎం జరిగింది? రాణి తన ఇంటికి వెలగలిగిందా? శాంతి ఆరోగ్యం కుదుటపడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే కరోనా సినిమా ని థియేటర్స్ లో చూడాల్సిందే.

👍

*  శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు, దక్షిణా గుట్టికొండ కుడా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. వంశి చాగంటి  బాగా చేశారు. 

* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ తమ తమ పాత్రకి న్యాయం చేసారు. 
* కథ చక్కగా వ్రాసుకున్నారు. 
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓకే.
*సినిమాటోగ్రఫీ బాగుంది.
*  ప్రొడక్షన్ విలువలు కూడా  బాగున్నాయి.

👎

* సినిమా  నిదానంగా సాగుతుంది,  చూపించిన అంశాలే మల్లి మల్లి చూపించి విసుగు తెపిస్తారు. 
* కధనం సరిగా రాసుకోలేక దర్శకుడు కొంత భాగము  విఫలం అయ్యాడు. 
* ఎడిటింగ్ అస్సలు బాలేదు.


ముగింపు :-
మొత్తానికి కరోనా వైరస్ సినిమా పేపర్ మీద బాగున్నప్పటికీ చిత్రీకరించడంలో దర్శకుడు అగస్త్య మంజు చాల శాతం నిరాశ చెందించాడు. చిత్రం మొత్తానికి శ్రీకాంత్ అయ్యంగార్ తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటారు. ఆయన తర్వాత రాణి గా నటించిన దక్షిణా గుట్టికొండ తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుంది. వంశి చాగంటి కూడా బాగా చేశారు. మ్యూజిక్ ఓకే.,  ఎడిటింగ్ అస్సలు బాలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తానికి ఈ కరోనా వైరస్ సినిమా మనం దాదాపు సంవత్సరం నుంచి బాధపడుతున్న అంశమే కొత్తగా చూడటానికి ఏమి లేదు. సరదాగా ఒకసారి చూసేయచ్చు లేదా ఇప్పటికే కరోనా తో జీవించింది చాలు అనుకునేవాళ్లు చూడాల్సిన అవసరం లేదు.

coronavirus movie rating :- 1.5/5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button