Today Telugu News Updates

ఒక్కరోజుకు లక్షన్నర బిల్లు, COVID19 hospital bills

 కరోనా కష్టకాలంలో ప్రయివేటు ఆస్పత్రులు కాసులకు కక్కుర్తి పడుతున్నాయి . COVID19 hospital bills వైరస్ సోకి ప్రాణభయంతో ఆస్పత్రులకు వచ్చే బాధితుల నుంచి ఇష్టారాజ్యంగా వసూళు చేస్తున్నారు . వారం క్రితం సికింద్రాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రి కరోనా పేషెంట్ కు మూడు రోజులకు మూడున్నర లక్షల రూపాయలు బిల్లు వసూలు చేస్తే , తాజాగా కరోనా లక్షణాలతో వచ్చిన ఓ ప్రభుత్వ వైద్యురాలు , ఆమె కుటుంబ సభ్యుల నుంచి చాదర్‌ఘాట్లోని తుంబి ఆస్పత్రి యాజమన్యం రోజుకు లక్షా పదిహేను వేల రూపాయలు వసూలు చేసింది . సరైన చికిత్స ఇవ్వటంలేదు , లక్షల్లో ఎందుకు ఛార్జి చేస్తున్నారని ప్రశ్నించిన ఆమెను ఆస్పత్రి సిబ్బంది నిర్బంధించారు . సెల్ఫీ వీడియోలో ఆమె తన గోడు వెలిబుచ్చడంతో ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు , అధికారులు వారిని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు .

 కరోనా బాధితుల నుంచి ప్రయవేటు ఆస్పత్రుల అడ్డగోలు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు ఏ చికిత్సకు ఎంత తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ధరలు నిర్ణయించినా .. ప్రయివేటు ఆస్పత్రులు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు . చాదర్‌ఘాట్లోని  తుంబే ఆస్పత్రి యాజమాన్యం కరోనా భయాలను సొమ్ము చేసుకుంటున్న వైనం ఆదివారం బయటపడింది . సాధారణ ప్రజలతోపాటు కరోనా వైరస్  ప్రైవేటు ఆస్పత్రులు అధిక బిల్లులతో చుక్కలు చూపెడుతున్నాయి . ఫీవర్ ఆస్పత్రి డిఎంఒ డాక్టర్ ఆశ్రా సుల్తానాతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా నిర్ధారణ కావడంతో రెండు రోజుల క్రితం చాదర్‌ఘాట్లోని తుంబే ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు . అయితే ఆస్పత్రి వైద్యులు సరైన చికిత్స చేయకపోగా రోజుకు లక్షా పదిహేను వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేయడంతో డా.సుల్తానా అక్కడ వైద్యులను ప్రశ్నించారు . డిశ్చార్జి చేయాలని కోరగా ఆస్పత్రి యాజమాన్యం వారిని నిర్బంధించింది . దీంతో తనకు సహాయం చేయాల్సిందిగా  సెల్ఫీ వీడియోలో డా.సుల్తానా కన్నీరుమున్నీరయ్యారు .

COVID19 hospital bills ::

‪కరోనా సోకిన ఓ ప్రభుత్వ డాక్టర్ దగ్గర లక్షలు దోచేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రి .

Posted by Telangana forum on Sunday, July 5, 2020

 బిల్లులపై ప్రశ్నించినందుకు సరైన వైద్య సేవలందించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు . తనతోపాటు తన కుటుంబ సభ్యులూ కరోనా బారినపడ్డారని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు . కాగా , సుల్తానా కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు . కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో చేరితే లక్షకు పైగా బిల్లు వేశారని విమర్శించారు . సుల్తానాను సత్వరమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు . ఆమెకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని , తుంబే ఆస్పత్రి గుర్తింపును రద్దు చేయాలని కోరారు . తుంబే ఆస్పత్రి వ్యవహారం బయటకు రావడంతో ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రతినిధులు వైద్యఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం కోసం ఆమెను , కుటుంబ సభ్యులను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు .

  తుంబే యాజమాన్యం  ఫీవర్ ఆస్పత్రి డిఎంఒ సుల్తానా చేసిన ఆరోపణలపై తుంబే ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది . సుల్తానా ఈ నెల 1 న తమ ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆమె వైద్య సిబ్బందితో గొడవ పడ్డారనీ , కొన్నిసార్లు అసభ్య పదజాలంతో దూషించేవారనీ పేర్కొంది . దీంతో ఆమెకు వైద్య సేవలందించేందుకు నర్సింగ్ సిబ్బంది నిరాకరించారని వెల్లడించింది . అయినా సుల్తానాకు కొవిడ్ చికిత్స కోసం సహకరించామని తెలిపింది . తెల్లవారుజామున ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయినట్టు యాజమాన్యం తెలిపింది . 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button