కొడుకు ను మింగిన మొసలిని ఓ తండ్రి ఏంచేసాడో.. చుడండి…!

crocodile swallowed son : దాదాపుగా 28 అడుగుల పొడవాటి మొసలి కడుపులో నుండి ఓ తండ్రి తన కొడుకును తీసిన ఘటన, తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణమైన సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోనేషియాలోని ఈస్ట్ కలిమన్‌తన్‌లో ‘సుబ్లియాన్షా’ అనే వ్యక్తి చాలారోజులుగా నివస్తిస్తున్నాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు ‘దిమస్ ముల్కన్ సపుత్ర’, ఈ బాలునికి 8 సంవత్సరాలు. గత బుధవారం ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ వారి ఇంటికి దగ్గర్లో ఉన్న నదికి చేపలు పట్టేందుకు వెళ్లి, ప్రమాద బారిన పడ్డారు.
ఎక్కడినుండి వచ్చిందో ఏమో హఠాత్తుగా ఒక 28 అడుగుల పొడవాటి మొసలి అమాంతం దిమస్‌పై పడి మింగేసింది. అది గమనించిన తండ్రి సుబ్లియాన్షా.. కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తూ ఉండగానే… ఆ బాలున్ని మింగేసింది. అయినా ఆ తండ్రి ఆ మొసలిని వదిలిపెట్టలేదు. చుట్టుపక్కల ఉన్న వారందరిని తీసుకొచ్చి ఆ మొసలిని వేటాడి చంపి తన కొడుకును బయటికి తీసాడు.
కానీ అప్పటికే ఆ బాబు చనిపోవడంతో ఆ తండ్రి తో పాటుగా అక్కడున్నవారు అందరు శోకసముద్రంలో మునిగిపోయారు.