James Bond No Time to Die Movie Review – జేమ్స్ బాండ్ రివ్యూ

Movie Review :- James Bond No Time to Die (2021)
నటీనటులు :- డానియల్ క్రైగ్ , రమి మలెక్ , లియా , నోమి హ్యర్రిస్ మొదలగు
నిర్మాతలు :- బార్బరా బ్రోకలీ , మైఖేల్ విల్సన్
సంగీత దర్శకుడు :- హాన్స్ జిమ్మీర్
డైరెక్టర్ :- క్యారీ జోజి
Daniel craig James ‘Bond No Time to Die’ Review And Rating :
Story :-
ఈ కథ జేమ్స్ బాండ్ ( Daniel craig ) తన పదవి విరమణ చేసుకొని లైఫ్ హ్యాపీగా లీడ్ చేస్తున్న సన్నివేశాలతో మొదలవుతుంది. ఆలా జేమ్స్ బాండ్ సరదాగా కాలం గడుపుతున్న సమయం లో , ఇంకో పక్క యం.ఐ 6 ల్యాబ్ లో పనిచేస్తున్న శాస్త్రవేత్త అయినా ఓబ్రుచెవ్(డేవిడ్) కిడ్నప్ కి గురవుతారు. ఈ శాస్త్రవేత్త ఓబ్రుచెవ్ ఒక జీవన ఆయుధాన్ని కనిపెట్టింటారు. దాని పేరే ప్రాజెక్టు హెర్క్యులెస్. దీని పనితీరు ఏంటంటే ఇందులోనున్న నానో బోట్స్ వైరస్ లా వ్యాప్తి చెంది మనుషుల ప్రాణాలకి హాని కలిగిస్తుంది. ఇది జరగకుండా అడ్డుపడాలంటే కిడ్నప్ అయినా ఓబ్రుచెవ్ ని వెతికి పట్టుకోవాలి. శాస్త్రవేత్త ని కనిపెట్టే బాధ్యత జేమ్స్ బాండ్ కి అప్పగించక , ఆ బాధ్యతలు జేమ్స్ బాండ్ ఎలా తీసుకున్నారు ? జేమ్స్ బాండ్ శాస్త్రవేత్త ని కనిపెట్టగలిగారా లేదా ? ఈ క్రమం లో జేమ్స్ బాండ్ ఎదురుకున్న సమస్యలు ఎటువంటివి? అస్సలు శాస్త్రవేత్తని కిడ్నాప్ చేయవల్సిన అవసరం ఎవరికీ వచ్చింది ? ఏ కారణం చేత కిడ్నప్ చేసారు ? శాస్త్రవేత్త సృష్టించిన ప్రాజెక్ట్ ఎలా ప్రజలకు హాని కలిగిస్తుంది ? మొత్తానికి జేమ్స్ బాండ్ ఎం చేసారు? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- డేనియల్ క్రెగ్ నటన ఎప్పటిలాగే అభిమానులకు మరియు స్పై ఫిలిం లవర్స్ కి , అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తారు.
- దర్శకుడు క్యారీ జోజి ఫుకునాగా సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
- యాక్షన్ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- క్లైమాక్స్ చాల ఎమోషనల్ గా ఉంది జేమ్స్ బాండ్ లవర్స్ కి ఏడుపు తెప్పిస్తుంది.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
ముగింపు :-
మొత్తానికి జేమ్స్ బాండ్ నో టైం తో డై అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా స్పై , జేమ్స్ బాండ్ లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే డేనియల్ క్రెగ్ తన మార్క్ నటనతో అభిమానులను అలరించి మరి చివరిలో ఏడ్పించేస్తారు. దర్శకుడు క్యారీ జోజి ఫుకునాగా కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి. సినిమా చివరిలో ప్రేక్షకులని ఏడిపించిన జేమ్స్ బాండ్ పాత్ర అభిమానుల గుండెల్లో చిరకాలం మిగిలిపోతుంది. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3.25 /5