Deepavali Special Gift from Radheshyam Team : రాధేశ్యామ్ సెకండ్ టీజర్ లోడింగ్ :-

Deepavali Special Gift from Radheshyam Team : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధేశ్యామ్ సినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ ఇంట్రో వీడియో రిలీజ్ చేసి సినిమా మీద ఎన్నడూ లేనంత హైప్ సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే.
ప్రభాస్ విక్రమాదిత్య గా ఉన్న వీడియో దేశవ్యాప్తంగా అందరిని అలరించింది. అయితే సినిమా కూడా అనుకున్న తేదీనే రావాలని చిత్రబృందం ఫిక్స్ అయ్యారు కాబ్బటి ప్రొమోషన్స్ మరియు క్యారెక్టర్ ఇంట్రో వీడియోస్ ఇలా అనేకరకాల పబ్లిసిటీ చేయాలనీ నిర్ణయించుకున్నారు రాధేశ్యామ్ టీం.
ఇందులో భాగంగానే ఈసారి దీపావళి కానుకగా రాధేశ్యామ్ సినిమాలో విక్రమాదిత్య లవర్ గా కనిపించబోతున్న ప్రేరణ అదేనండి పూజ హెగ్డే క్యారెక్టర్ ఇంట్రో వీడియో రిలీజ్ చేయాలనీ చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు. ప్రేరణ గా పూజ హెగ్డే ఎలా ఉండబోతుంది , సినిమాలో తన క్యారెక్టర్ ఏంటి ? అని ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇయ్యబోతున్నారు.
ప్రభాస్ అలియాస్ విక్రమాదిత్య క్యారెక్టర్ ఇంట్రో వీడియో నే ఇప్పటికి ఫ్యాన్స్ మరియు మూవీ లవర్స్ రిపీట్ చేసుకుంటూ చూసి ఆనందిస్తున్నారు , ఇంకా వారం రోజుల్లో పూజ హెగ్డే అలియాస్ ప్రేరణ క్యారెక్టర్ వీడియో వస్తే పూజ అభిమానులు కూడా చాల హ్యాపీ గా రిపీట్ మోడ్ లో చూసేందుకు సిద్ధం అవుతారు అనే విషయంలో ఎటువంటి సందేహం లేదు.
చూడాలి మరి అందరు అనుకున్నట్లే దీపావళి కానుకగా రాధేశ్యామ్ చిత్రబృందం నుంచి ప్రేరణ క్యారెక్టర్ ఇంట్రో వీడియో వదులుతారో లేదో. ఏదేమైనా సంక్రాంతి పోటీనుంచి తగ్గేదెలా అంటున్నారు రాధేశ్యామ్ బృందం.