Deva katta’s Complete change over : ఆ రెండు సినిమాలు తీసెంతవరకు చనిపోకూడదు :-

Deva katta ‘s Complete change over : ప్రస్థానం , ఆటో నగర్ సూర్య లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చినా దర్శకుడు దేవా కట్ట. అలాంటి గొప్ప దర్శకుడి నోటినుంచి ఇలాంటి మాటలు రావడం చాల బాధాకరం. ఆటో నగర్ సూర్య సినిమా తర్వాత చాల గ్యాప్ వచ్చింది. కానీ అయన స్ట్రాంగ్ కంబ్యాక్ ఇయ్యాలని సాయి ధరమ్ తేజ్ తో రిపబ్లిక్ సినిమా తీశారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతుంది.
అయితే ప్రమోషన్స్ భాగంగా దేవా కట్ట గారు కొని ఆశక్తి కరమైన విషయాలు చెప్పారు. అందులో భాగంగానే ” నేను గ్యాప్ తీసుకున్న చాల కొత్త కథలతో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకున్నాను. నేను రెండు కొత్త కధలు రాసుకున్నాను. అవి తీయకుండా చనిపోతానేమో అని భయం వేస్తుంది. ప్రజలకి ఆ స్టోరీస్ ఎలాగైనా చూపించాలి. అవి తీయకుండా పోతే నా జీవితం వృధా ” అని దేవా కట్ట గారు చెప్పారు.
దీనితో పాటు రిపబ్లిక్ రిలీజ్ తర్వాత 3 నెలలో ఇంకో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారు. వచ్చే 5-6 ఏళ్ళ వరకు అనుకున్న సినిమాలు అన్ని తీసేసి అపుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాను అని వెల్లడించారు. దేవా కట్ట గారు కోరుకున్నవి జరగాలని కోరుకుందాం .