Dia VS Dear Megha : దియా వైస్ డియర్ మేఘ :-

Dia VS Dear Megha : మనందరికీ దియా గురించి బాగా తెలిసి ఉండచ్చు. లాక్ డౌన్ సమయం లో ఎం చేయాలో అర్ధం కాకా పిచేకిపోతున్న ప్రజలందరికి దియా సినిమా ఒక వరం లా దొరికింది. కన్నడలో విడుదలయి ఘానా విజయం సాధించిన ఈ చిత్రం లాక్ డౌన్ పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు చూసేశారు. ఇది వాస్తవం. ఒక్క పాట కూడా లేకుండా అందరికి ఎక్కడ బోర్ కొట్టకుండా అలరించిన సినిమా ఇది.
ఇదిలా ఉంటె ఈ మధ్య కాలంలో ఈ చిత్ర బృందం ఈ సినిమాని అధికారికంగా తెలుగులో డబ్బింగ్ చేసి, ప్రొమోషన్స్ చేసి , యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో కూడా ఈ సినిమాకి వ్యూస్ బాగానే వచ్చాయి. అంతా బాగానే ఉంది అనుకున్న సమయం లో డియర్ మేఘ టీజర్ వచ్చింది. ఆ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్ గా చేస్తుంది. ఇంతకు ఇపుడు దియాన్ని పక్కనపెట్టి డియర్ మేఘ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా.
డియర్ మేఘ చిత్ర బృందం రైట్స్ తీసుకోకుండా, ఎవరికీ చెప్పకుండా కన్నడ దియా చిత్రాన్ని ఫ్రీమేక్ చేశారని అందరికి అనిపిస్తుంది. ఎందుకంటే డియర్ మేఘ కథ మరియు కధనం దియా లాగానే ఉంది కాబట్టి. అది కూడా వాస్తవమే.. అయితే ఈ చిత్ర బృందం దియా టీంని సంప్రదించకపోవడం వల్లే ఏమో దియా సినిమాని తెలుగు లో డబ్ చేసి విడుదల చేసేశారు. ఇపుడు నష్టం ఎవరికీ వస్తుంది అంటే కచ్చితంగా డియర్ మేఘ కె.
ఎందుకంటే ఆల్రెడీ అందరు లాక్ డౌన్ లో చూసేశారు. దానికి తోడు ఇపుడు తెలుగు లో ఆఫీసియల్ గా యూట్యూబ్ లో కూడా ఉంది. ఇపుడు అదే కథ మరియు కధనం తో డియర్ మేఘ ని థియేటర్ కి వెళ్లి మరి జనాలు చూస్తారా. ఒకవేళ ఓటీటీ కి వచ్చిన సినిమా లవర్స్ తప్ప సాధారణ ప్రేక్షకులు కన్నేతికుడా చూడరు.
సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న డియర్ మేఘ ఎటువంటి సంఘటనలు ఎదురుకొనబోతుందో వేచి చూడాలి.