Tollywood news in telugu
సినిమా ఇండస్ట్రీపై దియామీర్జా సంచలన వాక్యాలు !

dia mirza:: హీరోయిన్ దియామీర్జా సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించారు. సినీ పరిశ్రమ లో పురుషాధిక్యం ఎక్కువ ఉంటుందని దియా వెల్లడించారు. పెద్ద వయసు హీరోలు, వారి కూతురు వయసున్న అమ్మాయిలతో నటించడం చూస్తూ ఉంటె వింతగా అనిపిస్తుందని దియామీర్జా అభిప్రాయం వ్యక్తం చేసారు.
ఈ మధ్యనే ఇండస్ట్రీలో మహిళలకు గుర్తింపు లభిస్తోందని తెలిపారు. ఆమె దక్షిణాది చిత్రపరిశ్రమలో అవమానాలు కూడా చవిచూశానని అంతకముందు తెలిపిన విషయం తెలిసిందే.
ప్రతిసారీ కొత్త హీరోయిన్స్‌ను ఇండస్ట్రీలోకి తీసుకుంటారు , వారిని వయసు మళ్ళిన హీరోలతో నటింపజేస్తారు. అదేవిదంగా హీరోయిన్స్ కి వయసు మళ్లితే వారికీ మాత్రం అవకాశాలు ఇవ్వరు అని తెలిపారు. వయసు పై బడ్డ హీరోలు ఇంకా ప్రధాన పాత్రలు చేయడం యువహీరోలకు అన్యాయం చేయడమే అని దియా వెల్లడించారు.