చివరి చూపు కూడా చూడలేదు…..ఇంటికి వెళ్ళాక బోరున ఏడ్చినా దివి !

bigg boss 4: బిగ్ బాస్ లో దివి ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ మన అందరికి తెలిసిన విషయమే. హౌస్ లో 50 రోజుల ప్రయాణం తరవాత 7వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఇంటికి వెళ్ళగానే దివి తన ఇంట్లో జరిగిన చేదువార్త విని బోరున ఏడ్చిందట.
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగానే బయటి వాళ్ళతో సంబంధాలు ఉండవు. బయట ఎం జరుగుతుందో కూడా తెలీదు అంత కఠిమైన రూల్స్ ఉంటాయి.
దివి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన మొదటి వారంలోనే దివి తాత చనిపోయాడు. కానీ ఈ విషయం బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పలేదు. ఇండిటికి వెళ్ళగానే దివి తాత ఎక్కడున్నాడు కనపడట్లేదు అని అమ్మమ్మ ని అడగగానే ఇంట్లో వాళ్ళందరూ బోరున ఏడ్చారట. ఎందుకు ఏడుస్తున్నారు అని అడగగా దివికి తాత చనిపోయాడని చెప్పారని, అలాచెప్పేసరికి చివరి చూపు కూడా చూడలేకపోయానని బాదపడ్డానని తెలిపింది.
దీన్ని బట్టి అర్దమవుతుంది రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయి అని, బిగ్ బాస్ కంటెస్టెంట్ లు వారి మనసులో ఫ్యామిలీకి దూరంగా ఉన్న బాధను బయటికి కనపడనివ్వకుండా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఎంత కష్టపడుతారో అర్దమౌవుతుంది.