Krack Movie Director: ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు…

Krack Movie Director: కరోనా దృష్ట్యా మూతపడ్డ థియేటర్లు..సుమారు 8 నెలల తరువాత తెరుచుకున్న థియేటర్ లో సంక్రాంతి కి విడుదల అయిన “క్రాక్” చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూళ్లు చేసింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మూడు షోలు రదైన…ప్రేక్షకులు అవేవి లెక్కచేయకుండా.. మంచి సినిమాలు తాము ఎప్పుడు ఆదరిస్తామని నిరూపించారు.

మెగాస్టార్ చిరంజీవి,రాంచరణ్.. దర్శకులు హరీష్ శంకర్, త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి మొదలైన ప్రముఖులు “క్రాక్” చాలా బాగుందని తనకు ఫోన్ చేసి ప్రశంసించారని క్రాక్ మూవీ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెలిపారు. మా క్రాక్ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయమని ఎంత మంది ఒత్తిడి చేసిన.. దాని అసలు ససేమిరా అనలేదని..క్రాక్ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తేనే అభిమానులు త్రిల్ గా ఫీలవుతారని పట్టుదలగా ఎదురు చూసినట్లు గోపీచంద్ తెలిపారు.

కానీ తీరా చూస్తే మా సినిమా రిలీజ్ అయ్యే ముందు రోజే కోర్టు నుంచి స్టే రావడంతో.. ఆ రోజు రాత్రి తనకు అస్సలు నిద్ర పట్ట లేదన్నారు. అదే విధంగా మూడు షో లు రద్దు అవ్వడంతో చాలా బాధపడ్డానన్ని పేర్కొన్నారు. నాలాంటి పరిస్థితి ఏ దర్శకుడికి రావద్దని ఆవేదన వ్యక్తం చేశాడు.

అలాంటి క్లిష్ట సమయంలో నిర్మాతలు నాగ వంశీ, దామోదర్ ప్రసాద్, ఎన్ వి ప్రసాద్ వంటి వారు తమకు అండగా నిలిచారని.. అలాగే ఆ పరిస్థితుల్లో ఎందరో ప్రముఖులు ఫోన్ చేసితనకు ధైర్యం ఇచ్చారని.. వారందరికీ కృతజ్ఞతలని గోపీచంద్ తెలిపారు