Dil Raju 50th Birthday | దిల్ రాజు 50వ పుట్టినరోజు సందర్బంగా కదలిన తారాలోకం !

Dil raju Celebrating 50th birthday :: టాలీవుడ్ అగ్ర నిర్మాత అయినా దిల్ రాజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముకులనుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దిల్ రాజు టాలీవుడ్ ప్రముఖలుకు గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు.
ఈ పార్టీ కి సౌత్ ఇండస్ట్రీ తారాలోకం కదిలి వచ్చింది. దిల్ రాజు ఈ మద్యే రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తన భార్య తేజస్వినిని టాలీవుడ్ తరాలకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతో దిల్ రాజు ఈ పార్టీని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.
పార్టీలో మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్, విజయ్ దేవరకొండ, రాక్‌స్టార్ యశ్, మహేష్ బాబు, పవన్ కల్యాన్, రామ్‌చరణ్, ప్రబాస్, కేజీఎఫ్ చిత్ర యూనిట్, రామ్ పోతినేని, బెల్లంకొండ సురేష్, అనుష్క శెట్టి, పూజా హెగ్డే, రాశీ ఖన్నా, అనుపమ పరమేశ్వరణ్, పాల్గొని సందడి చేసారు.