Tollywood news in telugu
పవన్ కళ్యాణ్ సినిమాలో రానా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా !

rana movie: టాలీవుడ్‌లో యంగ్ హీరో రానా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ రీమేక్ సినిమా షూటింగ్ జరుగుతున్నా విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు సినిమాకి సంబంధించి ప్రకటన వెలువడింది.
ఇదిలా ఉంటె కొన్ని రోజులనుండి పవన్ నటిస్తున్న ఈ సినిమాలో రానా నటించడంలేదు అని పుకార్లు వినిపించాయి. ఇక ఈ పుకారుకు ఫుల్ స్టాప్ పడినట్లయింది. ఈ సినిమాపై ఇప్పటి నుంచే మంచి టాక్ వచ్చింది. దీనికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం రానా బారి రెమ్యునరేషన్ అడిగాడని ఇండస్ట్రీ టాక్ .
రానా ఈ సినిమాలో నటించేందుకు గాను రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అడిగినట్టు సమాచారం. చిత్ర నిర్మాణ సంస్థ కూడా రానా అడిగినంత ఇవ్వడానికి కూడా సై అన్నారట.