రివ్యూ: డోంట్ బ్రీత్ | Don’t breathe 2 Movie Review

Review : Don’t breathe 2 Movie
సినిమా :- డోంట్ బ్రీత్ 2 (2021)
నటీనటులు :- స్టీఫెన్ లాంగ్ , గ్రేస్
నిర్మాతలు :- ఫెయిత్ అల్వరెజ్ , సామ్ రామీ
డైరెక్టర్ :- రోడో సాయజెస్
కథ:-
ఈ కథ మొదటి భాగం పూర్తయిన 8 ఏళ్ళ తర్వాత నుంచి మొదలవుతుంది. అయితే నార్మన్ నోర్డ్ స్ట్రామ్ (స్టీఫెన్ లాంగ్ ) 8 ఏళ్ళ నుంచి ఫోనిక్స్ అనే పాపని సొంత కూతురిలా పెంచుకుంటున్నాడు. నార్మన్ గురించి అందరికి తెలిసిందే గా కళ్ళు కనిపించవు కానీ ఫోనిక్స్ ని చాల బాగా చూసుకుంటాడు. ఇదిలా ఉండగా అనుకోకుండా కొంతమంది క్రిమినల్స్ నార్మన్ ఇంటిలోకి చొరబడి ఫోనిక్స్ ని కిడ్నప్ చేయాలనీ ప్రయత్నిస్తారు. ఇక్కడినుంచి అసలైన బ్లడ్ వార్ మొదలవుతుంది. క్రిమినల్స్ వచ్చిన విషయం తెలుసుకున్న నార్మన్ ఎం చేయబోతున్నాడు ? కూతురుని ఎలా కాపాడబోతున్నాడు ? చివరికి ఎం జరిగింది ? పై ప్రశ్నల గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
👍 :-
- మొదటి పార్ట్ లాగానే ఇందులో కూడా స్టీఫెన్ లాంగ్ కళ్ళు లేని వాడిలా నటించి ప్రేక్షకులను తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేసాడు.
- కథనం. స్టీఫెన్ లాంగ్ సినిమా అంతా తన నటనతో టైటిల్ జస్టిఫికేషన్ చేశారు.
- మొదటి నుంచి చివరిదాకా గ్రిప్పింగ్ గా నడిపించారు డైరెక్టర్ రోడో సాయగస్.
- బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
- ఎడిటింగ్ బాగుంది.
- సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎 :-
- ఇలాంటి సినిమాలో కథ ఆశించకూడదు.
ముగింపు :-
మొత్తానికి డోంట్ బ్రీత్ 2 అనే సినిమా మొదటి పార్ట్ లాగానే చాలా అంటే చాలా అలరిస్తుంది. టైటిల్ కి తగ్గతుగానే సినిమా అంతా ప్రేక్షకులని స్క్రీన్ కి కట్టిపడేస్తుంది. స్టీఫెన్ లాంగ్ తనదైన స్టైల్ లో కళ్ళు లేనివాడిగా , కూతురిని కాపాడుకునే తండ్రిగా అద్భుతంగా నటించారు. ఫోనిక్స్ కూడా బాగా చేసింది. సినిమాలోని బ్లడ్ పాత్ సన్నివేశాలు ప్రజలకు భయంకరంగా భయం పుట్టిస్తాయి. మొదటి పార్ట్ చూసిన వారికి ఈ పార్ట్ కొంత మేరకు నచ్చకపోవచ్చు ఎందుకంటే నరేటివ్ స్టీల్ మిస్ అయింది కానీ సినిమా ఎక్కడ బోర్ కొట్టించదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. మొత్తానికి ఈ వారం థ్రిల్లర్ సినిమాలు ఇష్టమున్న వారు సరదాగా ఈ సినిమాని చుసెయ్యచు.
Rating :- 3 /5