Enemy Movie Review and Rating | హిట్టా ఫట్టా

Movie :- Enemy (2021) Review
నటీనటులు :- విశాల్ , ఆర్య , మిర్ణలిని రవి , ప్రకాష్ రాజ్ , మమత మోహన్ దాస్
నిర్మాతలు :- వినోద్ కుమార్
సంగీత దర్శకుడు :- థమన్. యస్. యస్
Director: – Anand Shankar
Release Date :- November 4 , 2021
ముఖ్యగమనిక :- ఈ వెబ్ సైట్ లో రాసిన లేదా రాయబోయే ప్రతి ఆర్టికల్ / రివ్యూస్ మా సొంత అభిప్రాయం తో రాసినది. డబ్బులకి రేటింగ్స్ ఇచ్చే సైట్ కాదని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఎవరైనా మా వెబ్ సైట్ రివ్యూస్ లింక్స్ ఫార్వర్డ్ చేసి మీకు పంపి డబ్బులు తీసుకున్నచో మాకు సంబంధం లేదు. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్బడుతే తగిన చట్టరీత్య చర్యలు తీసుకొన బడును. ఏమైనా సందేహాలు ఉంటె teluguvision1@gmail.com కి మెయిల్ చేయండి …… be aware of frauds and fake people.
Story ( Spoiler Free ) :-
ఈ కథ విశాల్ మరియు ఆర్య ల బాల్యం చూపిస్తూ మొదలవుతుంది. ఇద్దరు మంచి స్నేహితులు. ఆర్య వాలా నాన్న ప్రకాష్ రాజ్ పోలీస్ ఆఫీసర్. ఇద్దరినీ పెద్దయ్యాక డిపార్ట్మెంట్ లో చూడాలని చిన్నపటినుంచే ట్రైనింగ్ ఇస్తాడు. కొని అనుకోని సంఘటనల చేత ప్రకాష్ రాజ్ హత్య కి గురవుతారు.
ఇదే సమయం లో ఇద్దరు మిత్రులు వేరైపోతారు. ఆలా కాలం గడిచిపోయేకొద్దీ విశాల్ ని సింగపూర్ లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నట్లు చూపిస్తారు. అదే సమయం లో మంత్రి పై హత్యాయత్నం జరుగుతుందని గ్రహించి విశాల్ వచ్చి అడ్డుకుంటారు. ఆ సంఘటనని క్షుణంగా పరిశీలించాక అందులో విశాల్ స్నేహితుడైన ఆర్య ప్రమేయం ఉందని తెలుస్తుంది.
అస్సలు ఆర్య కి ఆ మంత్రి కి సంబంధం ఏంటి ? ఎందుకు ఆర్య ప్రస్తావన వచ్చింది ? నిజంగా ఆర్య నే మంత్రి పై హత్యాయత్నం చెశాడా ? ఇంతకీ ఆర్య తండ్రి అయినా ప్రకాష్ రాజ్ హత్య కి కారణం ఎవ్వరు? విడిపోయిన ఇద్దరు స్నేహితులు కలిశారా లేదా ? స్నేహితులు కాస్త శత్రువులు గా మారడానికి ఏమైనా బలమైన కారణాలు ఉన్నాయా ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్లో చూడాల్సిందే.
Positives 👍 :-
- విశాల్ మరియు ఆర్య కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా అంతటా విరి నటనతో ప్రేక్షకులను కట్టిపడేసారు. మిర్ణలిని రవి , ప్రకాష్ రాజ్ , మమత మోహన్ దాస్ వారి వారి పరిధిలో బాగా నటించారు.
- దర్శకుడు ఆనంద్ శంకర్ సినిమా మొదటినుంచి చివరిదాకా కథను నడిపే విధానం చాల బాగుంది ఎక్కడ బోర్ కొట్టకుండా చూసుకున్నారు.
- యాక్షన్ సన్నివేశాలు చాల బాగున్నాయి.
- బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
- నిర్మాణ విలువలు స్టైలిష్ గా ఉంది.
- సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- చివరి 20 నిమిషాలు సూపర్.
- ఎడిటింగ్ బాగుంది.
Negatives 👎 :-
- లెంగ్త్ ఎక్కువ.
- పాటలు పెద్దగా అలరించావు.
Overall:-
మొత్తానికి ఎనిమి అనే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు , ముఖ్యంగా థ్రిల్లర్ సినిమా లవర్స్ కి విపరీతంగా నచ్చే సినిమా అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. ఎప్పటిలాగే ఆర్య మరియు విశాల్ వారి మార్క్ నటనతో అభిమానులను అలరించారు. దర్శకుడు ఆనంద్ శంకర్ కథను నడిపే విధానం చాల బాగుంటుంది. ఎక్కడ బోర్ కొట్టకుండా తీశారు. యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలైట్. సినిమాటోగ్రఫీ , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాల బాగుంది. నిర్మాణ విలువలు చాల స్టైలిష్ గా తెరమీద కనబడ్డాయి.
లెంగ్త్ ఎక్కువ మరియు పాటలు పెద్దగా అలారించవు.ఈ రెండు నెగటివ్ పాయింట్స్ పక్కన పెడితే సినిమా చాలా బాగుంటుంది. మొత్తానికి ఈవారం కుటుంబం అంత ఈ సినిమాని హ్యాపీ గా చూసేయచ్చు .
Rating :- 3.25 /5