Episode 10 Telugu Bigg Boss Season 5 Live Updates – Day9

Episode 10 Telugu Bigg Boss 5 Day 9: ఈరోజు బిగ్ బాస్ హౌస్ లో రాత్రి 12:45 కి నామినేషన్ ఎందుకు చేసారని రవి మరియు నటరాజ్ మాస్టర్ మధ్య ఇష్యూ జరుగుతుంది. లోబో మానస్ మధ్య కూడా హిందీ లో ఇష్యూ మరియు బాధ చెప్పుకుంటున్నారు. సిల్లీ రీజన్స్ తో ఎలా నామినేట్ చేసావ్ అని.
తర్వాత శ్వేతా వర్మ , ప్రియాంక ముందర ఏడుస్తుంది. ఊరికే నామినేట్ చేస్తున్నారని. కంటెస్టెంట్స్ అందరు డబల్ స్టాండర్డ్ అని శ్వేతా వర్మ చెప్తుంది. రాత్రి 1:30 నిమిషాలకు రవి మరియు సిరి నటరాజ్ మాస్టర్ మీద నెగటివ్ గా మాట్లాడుతున్నారు. జెస్సీ మరియు శ్రీరామ్ మధ్య నామినేషన్ లిస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ప్రియా మరియు ఉమాదేవి సిల్లీ రీసన్స్ , సేఫ్ గేమ్ ఆడుతున్నారని మాట్లాడుకుంటున్నారు.
రాత్రి 3:10 నిమిషాలకు రవి , లహరి కలిసి లోబో మీద నెగటివ్ గా డిస్కస్ చేస్తున్నారు. లోబో కి అంత థింకింగ్ కెపాసిటీ లేదు అని మానస్ చెప్పాడు.
తర్వాత ఉదయం 9:45 నిమిషాలకు ముక్తల రీమిక్స్ సాంగ్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని నిద్ర లేపారు. కంటెస్టెంట్స్ తమ స్టైల్ లో డాన్స్ వేస్తున్నారు. డాన్స్ లో కూడా లోబో ఉమాదేవి కామెడీ చేశారు. తర్వాత శ్రీరామ్ మరియు యని మాస్టర్ నామినేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. శ్వేతా వర్మ సన్నీ ముందర ఏడ్చేసింది. 10:30 నిమిషాలకు లోబో ప్రియాంక కి విజిల్ వేసి కామెడీ చేస్తున్నారు. తర్వాత 12:15 నిమిషాలకు రవి , కాజల్ కలిసి లోబో కి ప్రశ్నిస్తున్నారు. సన్నీ మరియు ఉమాదేవి మధ్య హీటెడ్ డిస్కషన్ జరుగుతుంది. బాత్రూం లో సన్నీ ఉమాదేవి మధ్య జరిగిన డిస్కషన్ ఏ సన్నీ కాజల్ కి చెప్తున్నాడు.
కాజల్ , జెస్సీ , సన్నీ కామెడీ చేస్తున్నారు. లోపల సిరి , షణ్ముఖ్ , రవి కలిసి సన్నీ ఫేక్ అని చెప్తున్నారు. మధ్యాహ్నం 3:45 నిమిషాలకు సన్నీ నటరాజ్ మాస్టర్ మధ్య గుంట నక్క ఎవరు అని చెప్పండి అని అడగగా మాస్టర్ తన స్టైల్ లో క్లారిటీ ఇచ్చారు.
సాయంత్రం 5:30 నిమిషాలకు బిగ్ బాస్ నిన్న డివైడ్ అయినా టీమ్స్ తో కెప్టెన్సీ టాస్క్ పంతం నీదా నాద అనే టాస్క్ చేయాలి అన్నారు. అందులో భాగంగానే మొదటి టాస్క్ దొంగలు ఉన్నారు జాగ్రత్త. ఈ టాస్క్ లో ఏ టీం దగ్గర ఎక్కువ ఫ్లాగ్స్ ఉంటాయో వారు గెలిచినట్లు. రెండు టీమ్స్ తో ఫ్లాగ్స్ ఉంటాయి కానీ రెండు టీమ్స్ కొట్లాడ ఫ్లాగ్స్ లాక్కోవాలని చెప్పగా , రెండు టీమ్స్ డిస్కషన్ చేస్తున్నారు బ్రేక్.
10:42PM :- బ్రేక్ తర్వాత 6:16 నిమిషాలకు బిగ్ బాస్ సైరన్ మోగించారు. కంటెస్టెంట్స్ అందరు గార్డెన్ ఏరియా కి పరిగెత్తి వారి కలర్ బ్యాగ్ తీసుకొని దపెట్టుకోవాలి. సన్నీ సిరి ని పట్టేసుకున్నాడు. రవి మరియు శ్రీరామ్ మధ్య హీటెడ్ డిస్కషన్. షణ్ముఖ్ సన్నీ కి ఎథిక్స్ లేవు అని చెప్పాడు. సిరి సీరియస్ అయింది. సన్నీ సీరియస్ అయ్యాడు. ఎవరికీ వాళ్ళు ఎక్కడపడితే అక్కడ దాపెట్టేస్తున్నారు.
షణ్ముఖ్ సన్నీ మధ్య గొడవ. యెల్లో బ్యాగ్స్ కోసం యెల్లో టీం , బ్లూ బ్యాగ్స్ కోసం బ్లూ డ్రెస్ టీం తనకాలాడుతున్నారు. 6:45 నిమిషాలకు సన్నీ సిరి గొడవ పెట్టుకుంటున్నారు. సిరి కావాలని సన్నీ పైన లేనిపోని నిందలు వేస్తుంది. కాజల్ బ్లూ బాగ్ చింపేస్తుంది. అంటే ఎల్లో వాలు బ్లూ ని చింపినట్లు. తర్వాత లోబో స్పృహ కోల్పోయాడు. అందరు వచ్చి ఓదార్చారు. రవి మరియు విశ్వా మధ్య గొడవ మొదలయింది.
బిగ్ బాస్ లోబో ని కన్ఫెషన్ రూమ్ లోకి రామన్నారు. రవి విశ్వా కి మ్యాటర్ వివరిస్తున్నారు. శ్రీరామ్ డ్రామా ఆడుతున్నారు అన్నందుకు గొడవ మొదలయింది. కాజల్ ఇంకొకా బ్లూ బాగ్ చింపేసింది. సన్నీ ఏడుస్తుంటే రవి ప్రియాంక ఓదారుస్తున్నారు. సిరి మరియు లహరి తోసుకుంటున్నారు. ప్రియాంక కి దెబ్బ తగిలింది.
విశ్వా యెల్లో టీం వాళ్ళకి మమల్ని ఆడదు , హ్యుమానిటీ అని చేపి మీరు గేమ్ ఆడుకుంటారా ఆడుకోండి అని చప్పట్లు కొడుతున్నారు. రాత్రి 8:00, గంటలకు లోబో బయటికి వచ్చి ఈ గేమ్ నేను ఆడను అని , సిగేరేట్ కూడా తాగను అని చెప్పాడు బ్రేక్.
10:52PM:- బ్రేక్ తర్వాత 8:30 నిమిషాలకు రవి మరియు విశ్వా మధ్య సీరియస్ గా జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటున్నారు. రవి మరియు విశ్వా క్లారిటీ ఇచ్చుకుంటున్నారు. రవి సారీ చెప్పాడు. విశ్వా హాగ్ ఇచ్చారు.
సిరి , రవి కి సిట్యుయేషన్ చెప్తుంది. 9:45 నిమిషాలకు మానస్ చేసిన పనికి అందరు నవ్వుకుంటున్నారు. రాత్రి 10:45 నిమిషాలకు బిగ్ బాస్ రెండవ టాస్క్ గా సాధార సోదర అనే టాస్క్ మొదలు పెట్టామన్నారు. రెండవ టాస్క్ సమయం లో మొదటి టాస్క్ జరగకూడదు అని వివరించారు. రెండు టీమ్స్ లో స్ప్లిట్ ఎవరు పెద్దగా పెడితే వారు గెలిచినట్లు వారికీ ఫ్లాగ్ ఇయాలని చెప్పారు. ఇద్దరు సంచాలకులు పెట్టారు. మానస్ మరియు శ్రీరామ్ చంద్ర సంచాలకులు. శ్రీరామ్ చంద్ర కాజల్ ఎపుడు టార్గెట్ చేస్తుంది అని సీరియస్ అయ్యారు బ్రేక్ .
11:00PM :- బ్రేక్ తర్వాత 11:15 నిమిషాలకు మానస్ సిరి చేసింది తప్పు అని బల్ల గుద్దినట్లు చెప్పారు. సిరి ఎక్కడ తీసుకున్న బ్యాగ్ అక్కడ పెటేసింది.
ఇంతటితో ఈరోజు బిగ్ బాస్ సమాప్తం.