Fahad Fassil Bald Look : కొత్త లుక్ తో అందరిని షాక్ చేసిన ఫహద్ ఫాసిల్:-

Malyalam Fahad Fassil Bald Look : మలయాళం లో బెంగళూరు డేస్ అనే సినిమా విడుదలకు ముందు వీడు హీరో ఏంట్రా అనుకున్న ప్రేక్షకులందరిని తన సినిమాలతో, కొత్త కొత్త కథనాలతో అందరి నోరు మూయించి హీరో అంటే వీడేరా అనంత స్థాయికి ఎదిగారు. నిజంగా ఫాహద్ యువతరానికి ఒక నిలువెత్తు నిదర్శనం.
ఇపుడు అతని నటనకి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో మన తెలుగు సినిమాలో అతని తీసుకున్న విషయం తెలిసింది. అదేంటో కాదు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ విభిన్న లుక్ లో కనిపిస్తుండగా.. ఈరోజు ఈ పుష్ప లో విలన్ గా చేయబోతున్న ఫహద్ ఫాసిల్ లుక్ వదిలారు చిత్రా బృందం.
ఈ పోస్టర్ లో మునుపెన్నడూ చూడని ఫహద్ ని చూపించారు. పోస్టర్ చూడగానే ఫాన్స్ అందరూ ఊహించని విధంగా ఫహద్ లుక్ పుష్పాలో పెట్టడం ఫాన్స్ కి చాల అంటే చాల నచ్చేసింది.
ఈ సినిమాలో అల్లుఅర్జున్ మరియు ఫహద్ ల మధ్య భారీ లెవెల్ లో ఫైట్స్ ఉండబోతున్నాయాని చిత్ర బృందం తెలిపారు. ఈ సినిమాలో ఫహద్ పాత్ర పేరుగా భన్వర్ సింగ్ షెకావత్ అని చెప్పకనే చెప్పేశారు. క్రిస్మస్ కనుకనగా పాన్ ఇండియా లెవెల్లో విడుదలకు సిద్దమవుతున్న సినిమా , పోస్టర్లు, సాంగ్స్ తోనే హైప్ లేపుతున్నాయి. చూడాలి మరి పుష్పరాజ్ ఏ రేంజ్ లో అలరించబోతున్నాడో.