సంస్కృతిలో నాగుల యొక్క విశేషాలు
నాగుల చవితి నాడు నాగుల యొక్క ప్రత్యేకతలు ఈ కథనంలో
1. నాగులు భూసారాన్ని కాపాడడం లో,పొలాల్లో చిన్న చిన్న పురుగుల్ని తినేసి రైతు మిత్రులుగా
2.భూమిలో నీటి వనరులను పెంచటంలో
3.శివుడికి మెడలో హారంగా ,విష్ణువు కి తల్పము గా,సూర్యుడి రథంకు ఉండే గుర్రాలకు కట్టిన పగ్గపు తాడుగా ఉన్నవి కుడా సర్పాలే
ఇంకా కాలభైరవుని జంధ్యం గా,శని చేతుల్లో ఆయుధంగా,పాల కడలిని చిలికిన సమయాన కవ్వపు తాడుగా ఉపయోగపడ్డాయి.
4.మానవులకు కూడా సంతానం కు కారణం నాగ దేవతల దీవెనలే,పురుషుల్లో ప్రత్యుత్పత్తి కారకం అయిన వీర్య కణాలు కుడా సర్ప ఆకృతితో ఉంటాయ్.
5.మనిషి శరీరం లో ఉండేటువంటి వెన్ను పాము కింద ఉండే మూలాధారచక్రంలోని జ్ణానం అచేతన పామురూపం లో ఉంటుందని యోగ శాస్త్రం చెబుతుంది.అనగా అచేతన స్థితిలో ఉన్నటువంటి సర్పాల వల్ల కన్న చైతన్య స్థితిలో ఉండే జ్ణానం వల్లనే లోకానికి ఉపయోగం అని తెలుపుతున్నయ్.
6.పాములు కక్కే విషం,విడిచే కుబుసం కుడా ఆయుర్వేద శాస్త్రం లో తగు మోతాదులో వాడటం వల్ల అదీ కుడా ఔషధం గా ఉపయోగపడటం మనం గమనించ వచ్చు.
ఇలాంటి ఉపయోగాలు మరెన్నో ఉన్నాయ్.