Today Telugu News Updates
Femina Miss India 2020 : ఫెమినా మిస్ ఇండియా వరల్డ్‌గా తెలంగాణ అమ్మాయి మానస…. !

: బుధవారం ముంబైలో జరిగిన వీఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 పోటీల్లో మానస వారణాసి విజేతగా ఎంపికయ్యారు. ఇలా ఒక తెలంగాణ అమ్మాయి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా 2020గా హరియాణా అమ్మాయి మానిక శికంద్ నిలవగా, రన్నరప్‌గా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన మాన్యసింగ్ నిలిచారు. ఇందులో బాలీవుడ్ నటులు నేహా ధుపీయా, చిత్రాంగద సింగ్, పులకిత్ సమ్రాట్ జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.
వీఎల్సీసీ ఫెమీనా మిస్ ఇండియా 2020 పోటీలకు సెఫోరా, రోపోసా యాప్స్ సహకరించగా, మిస్ వరల్డ్ ఆసియా 2019 సుమన్ రావు నాయకత్వం వహించారు. ఈ పోటీల గ్రాండ్ ఫైనల్ Feb 28న హిందీ ఛానల్ కలర్స్ టీవీలో టెలికాస్ట్ అవుతుంది.