Finally Rakul fell in Love : ప్రేమలో పడ్డ రకుల్ ప్రీత్ సింగ్ :-

Finally, Rakul fell in Love : అవును మీరు చదివింది నిజమే. రకుల్ పుట్టిన రోజు సందర్భంగా , తన ఇంస్టాగ్రామ్ లో , తన ప్రేమ గురించి పోస్ట్ పెట్టి అభిమానులకు మరియు సదరు ప్రేక్షకులని షాక్ కి గురి చేసేసింది.
రకుల్ పుట్టినరోజున సెలబ్రిటీస్ అందరు వారి వారి ట్విట్టర్ , ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ నుంచి విషెస్ చెప్తుండగా రకుల్ తన ప్రేమ మీద పోస్ట్ పెట్టి అందరికి షాక్ కి గురిచేసింది. ఇపుడు సోషల్ మీడియా లో అంత రకుల్ పుట్టినరోజు విషయం మరిచిపోయి , రకుల్ ప్రేమ , పెళ్ళి టాపిక్ మీదకి షిఫ్ట్ అయిపొయింది.
మ్యాటర్ లోకి వెళ్తే బాలీవుడ్ సినిమాల నిర్మాత అయినా వాసు భగ్నానీ యొక్క కుమారుడు జాకీ భగ్నానీ. జాకీ భగ్నానీ బాలీవుడ్ సినిమాలలో హీరో. చాల సంవత్సరాల నుంచి రకుల్ మరియు జాకీ ప్రేమలో ఉన్నారని , ఈరోజు అధికారికంగా ప్రకటించారు ఈ ప్రేమ జంట.
దీనికి తోడు రకుల్ పుట్టినరోజు కావడంతో రకుల్ తన సోషల్ మీడియా లో ” థాంక్యూ మై లవ్ ! నా జీవితంలోని అతిపెద్ద గిఫ్ట్ నువ్వు ! నా జీవితం లో రంగులు మరియు నవ్వులు కురిపించినందుకు చాల అంటే చాల థాంక్యూ !! ఇంకా రాబోయే కాలంలో ఇద్దరం కలిసి ఎన్నో మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటూ రకుల్ ” ఈ విధంగా పోస్ట్ పెట్టి తన ప్రేమని అందరిని తెలిసేలా చేసింది.
దీనితోపాటు రకుల్ జాకీ తో కలిసి దిగిన మెమొరబుల్ ఫోటోని సోషల్ మీడియా లో షేర్ చేసింది. ఇప్పుడు ఈ ప్రేమజంట పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనేది ఆశక్తికరంగా మారింది. మొత్తానికి రకుల్ తన పుట్టినరోజున అందరికి తన ప్రేమ గురించి చెప్పి షాక్ ఇచ్చేసింది. ఏదేమైనా ఈ ప్రేమజంట త్వరలో పెళ్ళి చేసుకొని లైఫ్ హ్యాపీ గా లీడ్ చేయాలనీ కోరుకుందాం.