Finally Sesh Major Film Release Date Locked : మేజర్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ :-

Finally Sesh Major Film Release Date Locked : అడవిశేష్ సినిమాలు అంటే యువత కి మరియు ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారికి ఎంతగానో ఇష్టం. క్షణం సినిమా నుంచి ఇప్పటిదాకా అయన చేసిన ప్రతి సినిమా థ్రిల్లర్ ఏ , ప్రతి థ్రిల్లర్ హిట్ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. అంతలా తన యాక్టింగ్ తో అపుడపుడు స్క్రీన్ ప్లే సూపర్విజన్ తో ప్రేక్షకులని స్క్రీన్ కి కట్టిపడేస్తారు.
అలాంటి శేష్ ఇప్పుడు మేజర్ సినిమా తో రాబోతున్నారని ఎప్పటినుంచో తెలిసిన వార్తే. కరోనా అనే కీడా పురుగు రాకుంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అయిపోయేది. అంత మంచికే అనుకోని లేట్ అయినా పర్లేదు బెస్ట్ ఫీల్ ఇయ్యాలని ఈ సినిమా షూట్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాలలో శేష్ హాస్పిటాలైజ్ అయ్యారు కూడా. అయినా కూడా అవ్వని భరించి ఈ మేజర్ సినిమా షూటింగ్ మొత్తానికి పూర్తిచేశారు.
ఈ సినిమా 26/11 ముంబై టెర్రర్ అటాక్స్ లో ప్రాణాలు కొలిపోయిన మేజర్ ఉన్నికృష్ణన్ ధైర్య సహాసాల మీద చిత్రీకరించడం జరిగింది. 26/11 సంఘటన సమయం లో మేజర్ ఉన్నికృష్ణన్ ఎలాంటి ఎత్తులు వేసి ప్రజలని కాపాడారు , ఈ క్రమం లో అయన ఎదురుకున్న పరిణామాలు ఏంటి అనే అంశాల పై శేష్ మేజర్ ఉండబోతుందని తెలుస్తుంది.
ఈ సినిమా మహేష్ బాబు గారి ప్రొడక్షన్ లో నిర్మించగా శశి కిరణ్ దర్శకత్వం వహించారు. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 11 2022 న విడుదలకు సర్వం సిద్ధం చేసారు. చూడాలి మరి మేజర్ ఉన్నికృష్ణన్ గారి పాత్రలో శేష్ ఎలా కనిపించబోతున్నారో , ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఫిబ్రవరి 11 న తెలుస్తుంది.