Tollywood news in telugu

మన బాల్యం లో పక్కింట్లోకి వెల్లి మరీ చుసిన 5 అపురూప సినిమాలు…ఇవి చుస్తే మళ్ళీ మనం చిన్నపిల్లలం కావల్సిందే….!

మనకు మళ్ళీ తిరిగిరానిది , ఎన్నో మధురానుభూతులు మిగిల్చినది బాల్యం . అప్పుడు చేసిన అల్లరి, చిలిపి పనులు , అన్నాచెల్లెళ్ళతో పోట్లాటలు, అమ్మానాన్నల గారాభం , అమ్మమ్మతాతయ్యల ముద్దులు.. ఇవన్నీ ప్రతిఒక్కరి బాల్యంలో మరచిపోని, తిరిగిరాని మధురానుభూతులు. అందుకే  ఓల్డ్ ఈజ్ గోల్డ్  అన్నట్టు మన బాల్యంలో గడిపిన రోజులన్నీ గోల్డెన్ డేస్ అవుతాయి.

మరి ఇలాంటి బాల్యం రోజులు కొన్ని సందర్భాలలో గుర్తుకువస్తు ఉంటాయి.  అవి చిన్ననాటి బాల్య స్నేహితులు ఎదురు పడినపుడో, లేదంటే మన బాల్యంలో చుసిన సినిమాల వల్లనో అప్పటిరోజులు నెమరువేసుకుంటూ ఆనందపడుతూ ఉంటాం. మరి మనకు కొన్ని మధురానుభూతులు మిగిల్చిన కొన్ని సినిమాలు మీకోసం…

five  Awesome Movies

బాల రామాయ‌ణం :

గుణశేఖ‌ర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో జూనియర్  ఎన్టీఆర్ మొద‌టి సారిగా నటించాడు. ఈ బాల‌రామాయ‌ణం మూవీలో తన బారి డైలాగులతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసి. సీనియర్ ఎన్టీఆర్ మనవడు అనిపించుకున్నాడు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా హిట్ కాక‌పోయినా మంచి టాక్ వచ్చింది.

అంజ‌లి:

అంజలి సినిమా అనగానే బేబీ షామిలీ మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, అలాగే తను అలిగే సందర్భాలు, అమాయకపు చూపులు , మనలను కట్టిపడేశాయి. బేబీ షాలిని అంటే ఇప్పటి వాళ్లకు అంతగా తెలియకపోయిన. మనకు మాత్రం షామిలి  చెరిగిపోని ముద్ర వేసుకుంది.. ఇందులో షామిలి, త‌రుణ్ ల‌ను హైప‌ర్ కిడ్స్ గా చూపించారు మ‌ణిర‌త్నం గారు. ఇదికూడా మనకు ఒక మెమొరబుల్ మూవీ అని చెప్పవచ్చు.

పాపం ప‌సివాడు:

‘లాస్ట్ ఇన్ ది డిజ‌ర్ట్’ దక్షిణాఫ్రికా సినిమా అయినటువంటి ఈ  సినిమాను రిమేక్ చేస్తూ తెలుగులో వి. రామచంద్రరావు ‘ పాపం ప‌సివాడు’  అనే పేరుతో 1973 లో చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని పాట ‘ అమ్మా చూడాలి నిన్నూ నాన్న‌ను చూడాలి’ అనే పాట అపుడు మనలను  ఏడ్పించేసింది. అలాగే బాబు ఎడారిలో పడే కష్టాలు ఇప్పటికి మనకు గుర్తుకువస్తే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి.

సిసింద్రీ :

ఈ సినిమాను మనం ఎన్ని సార్లు చూసామో తెలీదు గాని, అప్పుడు మనం చుసిన ఈ మూవీని , ఇపుడు మన పిల్లలకు టివిల్లో వస్తే, వాళ్లకి చూపిస్తూ , మనం అపుడు చూసిన రోజులను గుర్తుచేసుకుంటున్నాము. నాగార్జున కొడుకు అఖిల్ న‌టించిన ఈ చిత్రం మనకు ఒక మెమొరబుల్ సినిమా. ఇందులోని పాట ‘ చిన్నితండ్రీ 

నునుచూడగా’ అనే పాట వినబడితే చాలు ఈ పాట సిసింద్రీ సినిమాలోది అని టక్ మని చెప్పేస్తాం. అంతలా గుర్తుండిపోయింది . ఈ సినిమా అలాగే మన చిన్నతనంలో అమ్మ  మ‌న‌ల్ని ముద్దు చేసిన సంద‌ర్భాలెన్నో గుర్తుకు వస్తాయి. శివ‌నాగేశ్వ‌ర్రావ్ డైరెక్ట్ చేసిన ఈ   మూవీ  1995లో విడుదలైంది.

లిటిల్ సోల్జ‌ర్స్ :

ఈ సినిమా  సస్పెన్స్, క్రైమ్ లకు కామెడీ జోడించి గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన తీరు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ మూవీ చుస్తే మనబాల్య స్మృతులు గుర్తుకువస్తాయి. ఇందులోని ‘ ఐ యామ్ వెరీ గుడ్ గర్ల్ ‘ అనే విన్నప్పుడల్లా అప్పటికాలంలోకి వెళ్లిపోక తప్పదు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button