అవిసె గింజల ఉపయోగాలు

Flax seeds in telugu :: మన ఇండియాలోనే కాక ప్రపంచ మంతటా ఎంతో మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. దీనికి గల కారణాలు లేకపోలేదు, అదే మన శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు, దీని ద్వారా గుండెకు తగినంత ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితి లోకి వెళ్తున్నారు.
ఇలాంటి అనారోగ్య పరిస్థితులు రాకుండా ఉండాలంటే వైద్య నిపుణులు ” అవిసె గింజల్ని” తినమని సూచిస్తున్నారు. ఈ అవిసె గింజలో ‘ఒమేగా 3’ఫ్యాటీ యాసిడ్స్ మన గుండెని కాపాడతాయట.
1. ఈ అవిసె గింజలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
2. వీటిని పేనంలో వేయించుకొని కూడా తినవచ్చు.
3. మహిళలో హార్మోన్లను సమన స్థాయిలో ఉంచుతాయి. వీరి లో ఉండే వివిధ సమస్యలను కూడా దగ్గరికి రాకుండా కాపాడుతాయి.
4.ఈ గింజలో ఉండే ఫైబర్ గ్యాస్,అసిడిటీ,జీర్ణ,సమస్యలు రాకుండా కాపాడుతుంది.
5. అవిసె నూనెద్వారా పేగు,రొమ్ము క్యాన్సర్ల నుండి కూడా బయట పడవచ్చు.
6.చేపలు తినలేని వారికీ ,ఈ అవిసె గింజలద్వారా చేపలలో దొరికే ప్రోటీన్స్ దొరుకుతాయి.
7. ఈ గింజల ద్వారా మోకాళ్ళ నొప్పులు,ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి.
8. వీటిని ఉదయాన్నే తీసుకుంటే ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
9. ఇవి మధుమేహం ఉన్నవారికి ఎంతో ఉపయోగ పడుతుంది.
10. అవిసె గింజల్ని పొడి చేసుకొని తీసుకోవడం ద్వారా త్వరగా మన శరీరం లో కలిసిపోయి,పైన చెప్పిన వివిధ రకాల జబ్బులను నయం చేస్తుంది.