health tips in telugu

పెద్ద వారిలో మెదడు పై తీవ్ర ప్రభావం చూపే హై బీపి

ఈ రోజుల్లో అందరికీ సాధారణంగా బీపి ఉంటుందో. ఎవరి ఆహారపుటలవాట్లను బట్టి వారికి హై బీపి, లో బీపి ఉంటుంది. తాజా అధ్యయనం ప్రకారం ఈ హై బీపి వయసు పై బడిన వారిలో మెదడు పై తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు పరిశోధకులు. రక్తపోటు అధికంగా ఉంటే, అది వారి మెదడు పని తీరు పై ప్రభావం చూపి అల్జ్హైమర్స్ వంటి జబ్బులకు కారణం కావచ్చు అంటున్నారు పరిశోధకులు. అయితే దీని పై సమగ్ర పరిశోధన అవసరం. ఇంత వరకు వయసు మళ్ళిన వారి పై చేసిన ఆటోప్సి రిపోర్ట్లలో బీపికి, మెదడు పని తీరును ప్రభావితం చేస్తోందని కనుగొన్నారు. అయితే దీని పై ఇంకా విస్తృతంగా పరిశోధన జరగాల్సి ఉంది. అందువల్ల మనం హై బీపి ఉన్న వారికి ఆ బీపిని అదుపులో ఉంచే 5 రకాల పళ్ళేమిటో చూద్దాం.

బెర్రీలు: స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ మొదలైనవి anti oxidant లు అధికంగా కలిగి ఉంటాయి. అంతే కాదు వీటిలో గుండెకు మేలు చేసే flavanoids ఉండటంతో హై బీపి కలవారికి మరింత మంచిది. ఇవి రక్త పోటును తగ్గించడంలో దోహదపడతాయి అని Journal of the Academy of Nutrition and Dietetics వారు ప్రచురించిన ఒక పరిశోధనలో పేర్కొన్నారు.

పెరుగు: American Heart Association (AHA) ప్రకారం వారంలో 5 సార్లు కంటే ఎక్కువ సార్లు పెరుగు తీసుకున్న ఆడవారిలో హై బీపి వచ్చే అవకాశం అసలు పెరుగు తీసుకొని ఆడవారి కంటే తక్కువ ఉంటుంది అంటున్నారు.

అరటి పండు: ఈ పండు పొటాషియం, కాల్షియమ్, మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటుంది. అందువల్ల ఇది కూడా రక్త పోటు నియంత్రణకు మంచిదే.

పాల కూర: ఈ ఆకు కూర పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం లో అధికంగా ఉండడమే కాక అత్యధికంగా పీచు పదార్ధం కలిగి ఉంటుంది.

కివి: American Heart Association (AHA) ప్రకారం రోజుకీ మూడు కివిలు తింటే ఎంతటి అధిక రక్త పోటు అయినా నియంత్రించబడుతుంది అంటున్నారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button