గుండెకు హానిచేసే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ఆరోగ్యంగా జీవించాలంటే శరీరంలోని ప్రతి అవయం ఆరోగ్యంగా ఉండాల్సిందే. అయితే అన్నింటిలోకెల్లా గుండె ప్రధానమైనది. గుండె పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంలో తప్పనిసరిగా పోషక విలువలు ఉండేలా చూసుకోవాలి. మరి ఈ గుండెను కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి పరిశీలిస్తే..
హృదయం అనుకోని అనారోగ్యానికి గురవ్వడానికి ప్రధాన కారణం ఆహార నియమాలు పాటించకపోవడం ఎక్కువ మోతాదులో ఉప్పు, చక్కెర, సంతృప్త కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

రెడ్ మీట్ ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వచ్చే అవకాశం ఉంది.
తక్కువ మోతాదుల చక్కెరను తీసుకోవడం శరీరానికి ప్రమాదకరమేం కాదు. కానీ ఒక రోజులో తీసుకోవాల్సిన మోతాదుకన్నా ఎక్కువ తీసుకుంటే అధిక బరువు, ఊబకాయం, డయాబెటిస్, రక్తపోటుతో పాటు గుండె నొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంది.
గోధుమపిండిని వాడుతూ చక్కెను తగ్గించాలి. వెన్నకు బదులుగా లిక్విడ్ ప్లాంట్ ఆయిల్స్‌న వాడటం మంచిది.
శుద్దిచేసిన ధాన్యాలు త్వరగా షుగర్ కంటెంట్‌గా మారిపోతాయి. అవి శరీరంలో కొవ్వుగా స్థిరపడిపోతాయి. ఇది గుండె జబ్బు, టైప్ 2 డయాబెటిస్ రావడానికి కారణమవుతుంది. వీటికి బదులుగా బ్రౌన్‌రైస్, ఓట్స్, గోధుమపిండిని తీసుకోవడం మంచిది.