best web series reviews

ఫోరెన్సిక్ 2020

forensic movie review 2020

forensic movie review 2020:: సినిమా :- ఫోరెన్సిక్   (2020)

నటీనటులు :- టోవినో థామస్, మమతా మోహన్‌దాస్

మ్యూజిక్ డైరెక్టర్:- జేక్స్ బిజోయ్ 

నిర్మాతలు :- నావిస్ జేవియర్, సిజు మాథ్యూ 

డైరెక్టర్ :- అఖిల్ పాల్ & అనాస్ ఖాన్ 

మలయాళంలో ఘన విజయం సాధించిన ఫోరెన్సిక్ చిత్రం ఈరోజు మన తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు మనం తెలుసుకుందాం. 

కథ:-

ఈ కథ చిన్న వయస్సు గల అమ్మాయిలని కిడ్నాప్ చేసి వారి చేత మర్డర్స్ చేపించిన తర్వాత ఆ అమ్మాయిలని చంపేస్తాడు సైకో కిల్లర్. అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి రితిక ఐపిఎస్ ( మామతా మోహన్ దాస్ )కి కేసు అప్పగిస్తారు. మమతా మోహన్ దాస్ టీంలో ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ శామ్యూల్ జాన్ కట్టూక్కరన్ (టోవినో థామస్) మరియు శిఖా (రెబా మోనికా జాన్) జాయిన్ అవుతారు. కానీ మమతా మోహన్ దాస్ కి మరియు టోవినో థామస్ కి అస్సలు పడదు. దానికి గల కారణం వారిద్దరి మధ్య చేదు సంఘటనలతో కూడా గతం ఉంది. గడిచే ప్రతిరోజూ కేసులో మలుపులు తిరుగుతూ ఉంటాయి. కేసుకి సంబంధించిన విషయాలు తెలుసుకునే క్రమంలో ప్రతీదీ 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలకు లింక్ అయి ఉంటుంది. అసలు ఆ గతం ఏంటి ? సైకో కిల్లర్ ఎవరు ? మమతా మోహన్ దాస్ మరియు టోవినో థామస్ ల మధ్య ఏం చేదు సంఘటనలు జరిగాయి ? అసలు వీరిద్దరూ కలిసి కేసు ని ఎలా సాల్వ్ చేశారు అన్నదే సినిమా..

* టోవినో థామస్ మరియు మమతా మోహన్‌దాస్ లు సినిమా మొత్తాన్ని చాల పైకి తీసుకొని వెళ్లారు వారి నటన కూడా చాల ఇంటెన్స్ తో కూడి ఉంటుంది.

* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా వివరించారు.  సైకో కిల్లర్ కూడా బాగా చేశారు.  

* డైరెక్టర్ కథ మరియు కథనం చక్కగా వ్రాసుకున్నారు. ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రతి 5 నిమిషాలకి ట్విస్ట్ వచ్చేలా చిత్రీకరించారు.

* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది. 

*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

*  ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.

*  ఎడిటింగ్ కూడా బాగా చేశారు. 

* రెండవ భాగంలో కొన్ని అనవసరపు సన్నివేశాలు ఉన్నాయి. 

ముగింపు :-

మొత్తానికి ఫోరెన్సిక్ చిత్రం ప్రేక్షకులందరికీ ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. ట్విస్టులకి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. నటీనటులు అందరూ సినిమాకి చాలా ప్లస్ అయ్యారు. మమతా మోహన్ దాస్ సినిమాని తన భుజాలపై వేసుకొని నదిపించినట్లు అనిపిస్తుంది. కథ కథనాలు కొత్తగా ఉన్నాయి. నిర్మాణ విలువలు మరియు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దర్శకుడు చాలా రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని తీశాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి బాగా ప్లస్ అయింది. మొత్తం మీద ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూసి ఎంజాయ్ చేస్తారు అని అనడంలో సందేహం లేదు.

forensic movie review & Rating

రేటింగ్ :- 3.25 /5

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button