health tips in telugu
Fast Food: ఫాస్ట్‌ఫుడ్‌తో తప్పదు పరేషాన్..
ఫాస్ట్ ఫుడ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. మన ఆరోగ్యానికి అది ఏవిధంగానూ మంచిది కాదని తెలిసినా మనం తినకుండా ఉండలేమంటే దాని ప్రభావం మన మీద ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా ఫాస్ట్‌ఫుడ్ తినడం వల్ల కలిగే లాభలకన్నా నష్టాలే ఎక్కువ.. అవేంటో మనం ఒకసారి గమనిస్తే..
జంక్‌ఫుడ్ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇందులో కేలరీలు అధిక మోతాదులో ఉంటాయి. పోషలు విలువలు ఉండవు. అందువలన బరువు పెరిగే అవకాశం ఉంది.

ఫాస్ట్‌ఫుడ్‌లో సోడియం అధికంగా ఉంటుంది. సోడియంను హెచ్చుగా తీసుకోవడం వల్ల రక్తపోటు వచ్చే అవకాశం ఉంది.
ఫాస్ట్‌ఫుడ్ వల్ల జీర్ణ వ్యవస్థ సైతం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇందులో ఉండే యాసిడ్‌లు దంతాలు, చిగుర్ల ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తాయి.
ఫాస్ట్‌ఫుడ్‌లో ఉండే చక్కెర, కొవ్వు, ఉప్పు చర్మానికి హాని కలిగిస్తాయి.