technology information

మీ కంప్యూటర్ లో మిస్ ప్లేస్ అయిన లేదా పోగొట్టుకున్న ఫైళ్ళను కనుగొనడానికి 4 టిప్స్

టెక్నాలజీ ఈ రోజుల్లో పెద్ద మొత్తంలో డిజిటల్ డేటాను నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం డేటాను మన సిస్టమ్స్ లో మరియు పోర్టబుల్ ప్లాట్ ఫారమ్స్ లో నిల్వ చేయవచ్చు లేదా క్లౌడ్ స్టోరేజ్ కోసం ఎంపిక చేసుకోవచ్చు. మనం సేవ్ చేసుకొనే డేటా స్టోరేజ్ ఎక్కువయ్యే కొద్ది , స్టోర్ చేసిన ఫైల్ యొక్క పేరు మర్చిపోవడం అనేక సందర్భాల్లో జరుగుతుంది. మనం ఒక్కోసారి స్టోరేజ్ లో ఒక పర్టికులర్ ఫైల్ ని ఉంచినట్లయితే కొన్నిసార్లు వాటిని కూడా మరచిపోతుంటాము. మీ కంప్యూటర్ లో మీరు మిస్ చేసుకున్న లేదా misplace అయిన files రికవర్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.

  1. ఇటీవల-సేవ్ చేయబడిన ఫైళ్లను లోకేట్ చేయడం:

మీరు ఫైల్ పాథ్ ని చూడకుండా మైక్రోసాఫ్ట్ వర్డ్ లేదా ఎక్సెల్ ఫైళ్ళను సేవ్ చేసిన సందర్భాలలో ఈ టిప్ యూస్ అవుతుంది. అటువంటి సందర్భాల్లో, మీరు ఫైల్ ని సేవ్ చేసిన ఫోల్డర్ ఏది అని మీకు ఏమాత్రం ఆలోచన ఉండదు మరియు తక్షణమే మీరు ఆ ఫైల్ ని పొందడానికి పానిక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఆ ఫైల్ ని త్వరగా కనుగొనటానికి, అప్లికేషన్ ని తెరిచి ఇటీవలి రీసెంట్ ఫైల్స్ లిస్టు ని ఓపెన్ చేయండి. MS ఆఫీస్ సూట్ లో, మీరు అప్లికేషన్ ని తెరిచినప్పుడు మీరు రీసెంట్ యాక్సెస్ ని పొందగలుగుతారు. లేకపోతే సింపుల్ గా ఫైల్, ఓపెన్, ఆపై, రీసెంట్ డాక్యుమెంట్స్ కి వెళ్ళండి.

  1. పార్షియల్ ఫైల్ పేరుతో Windows లో సెర్చ్ చేయండి:

మీరు ఫైల్ ని కొన్ని రోజులు లేదా నెలల ముందు సేవ్ చేసినట్లయితే మరియు ఫైల్ పేరులోని మొదటి అక్షరాలని గుర్తుంచుకోగలిగితే, మీరు Windows ని స్టార్ట్ చేసి ఆ అక్షరాలు టైప్ చేసి, ఆపై సెర్చ్ ఆప్షన్ ని హిట్ చేయండి. చాలా వరకు మీరు ఆ ఫైల్ ని కనుగొంటారు.

  1. ఎక్స్టెన్షన్ టైప్ సహాయంతో సెర్చ్ చేయండి:

ఈ పద్ధతి ఫైల్ ఎక్స్టెన్షన్ లో టైప్ చేయడం ద్వారా మీరు సెర్చ్ చేస్తే ఆ ఫైల్ లొకేషన్ ని మీకు అందిస్తుంది. ఉదాహరణకు, మీ ఫైల్ MS వర్డ్ డాక్యుమెంట్ అయితే, ఫైల్ Explorer లో సెర్చ్ బార్ లో ‘.doc’ లేదా ‘.docx’ టైప్ చేసిన తర్వాత ఎంటర్ నొక్కండి లేదా, అది ఎక్సెల్ ఫైల్ గా ఉంటే, ‘.xls’ ద్వారా సెర్చ్ చేయoడి. అదేవిధంగా ‘.mp4’, ‘. Mp3’ మొదలైనవి

  1. Cortana సహాయంతో సెర్చ్ చేయండి

సెర్చ్ చేయడానికి మరొక మార్గం, కార్టానాని ఉపయోగించడం. డాక్యుమెంట్ల కోసం ప్రత్యేకంగా వెతుకుతున్నప్పుడు, టాస్క బార్ లోని కార్టానా ఐకాన్ పై క్లిక్ చేస్తే, మీరు ఎక్కువగా రీసెంట్ గా సేవ్ చేసిన ఫైల్స్ జాబితాని “ పిక్ అప్ వేర్ యు లెఫ్ట్ ఆఫ్” అనే దాని క్రింద చూడవచ్చు. మీరు ఇటీవల సేవ్ చేయబడిన ఫైల్స్ ని ఇక్కడ చూడవచ్చు. లేదా, “సెర్చ్ ఫర్ “ కింద ‘డాక్యుమెంట్స్’ పై క్లిక్ చేసి, ఫైల్ పేరును టైప్ చేయండి.

సో ఈ పైన చెప్పిన టిప్స్ ని ఫాలో చేసి మీ కంప్యూటర్ లోని misplace అయిన మరియు పోగొట్టుకున్న files తిరిగి పొందవచ్చు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button