బాయ్ ఫ్రెండ్ పాటకు తన గొంతు కలుపుతూ… తలకు నిప్పంటించుకున్న ప్రేయసి.. వీడియో వైరల్ !

బాయ్ ఫ్రెండ్ గిటారు వాయించుతూ పాట పడుతుంటే ఏ ప్రేయసైనా గొంతు కలిపి మైమరచి పోవాల్సిందే. ఇలా తన ఫ్రెండ్ పాడుతున్న పాటకి గొంతు కలుపుతూ వెనకాల ఏమి ఉందొ చూసుకోకుండా తన జుట్టు, అలాగే జుట్టుతో పాటు వీపు కాల్చుకుంది.
ఈ సంఘటన ఇంపుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. స్పెయిన్‌లోని మ్యాడ్రిడ్‌లో నివసిస్తున్న యూకే యువతి ‘సోఫియా ఎల్లార్’ క్రిస్మస్ నాడు ఆమె ఇంట్లో కొవ్వుత్తులను వెలిగించింది. తరవాత తన బాయ్‌ఫ్రెండ్ ‘అల్వారో సోలెర్’తో కలిసి పాడుతూ పాటలో మునిగిపోయింది. దీంతో ఆమె వెనక్కి వాలి నవ్వుతూ గొంతు కలపగా అంతలోనే వెనుక వైపు ఉన్న కొవ్వొత్తి నిప్పు ఆమె జుట్టుకు అంటుకుంది.
నిప్పు అంటుకున్న విషయాన్నీ కాస్త లేటు గా గుర్తించడంతో ఆమె వీపుకు మంట తగిలింది. అపుడు గుర్తించిన ఆ యువతి మంటలను ఆర్పేందుకు పరుగులు తీసింది. ఆమె బాయ్‌ఫ్రెండ్ కూడా మంటలను ఆర్పే ప్రయత్నం చేసాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.