technology information

Go Pro vs Noise Play 2 action camera in telugu

Go Pro vs Noise Play 2 action camera in telugu

ఒకప్పుడు డిజిటల్ కెమెరాల హవా నడిస్తే ప్రస్తుతం యాక్షన్ కెమెరాల హవా నడుస్తోంది. అసలు ఈ యాక్షన్ కెమెరా అంటే ఏంటి అనుకుంటున్నారా. ఇవి మన అర చేతిలో ఇమిడి పోయే కెమెరాలు. ఏమైనా ఒక అడ్వెంచర్ లేదా స్పోర్ట్ ను నిరాటంకంగా వీడియో తీయడానికి ఇవి ఉపయోగపడతాయి. ఈ కెమెరాలకు వాటర్ప్రూఫ్ తొడుగు కూడా ఉండటంతో సర్ఫింగ్ మొదలైనవి వీడియోలు తీయచ్చు. ఇవి 4K వీడియోలు రికార్డు చేస్తాయి. వీటిని హెల్మెట్, బైక్ హేండిల్ మొదలైన వాటి మీద పెట్టుకుని వీడియోలు రికార్డు చేస్తారు. షార్ట్ ఫిలిం మేకర్స్ మరియు స్పోర్ట్స్ మెన్ వీటిని వాడటానికి ఇష్ట పడతారు.

అయితే ఇటువంటి కెమెరాలకు తెర తీసింది Go Pro అనే కెమెరా. యాక్షన్ కెమెరాలలో Go Pro విపరీతంగా ఆదరణ పొందింది. అయితే ప్రస్తుతం దానికి పోటీగా Noise Play 2 అనే యాక్షన్ కెమెరా కూడా విడుదల అయింది. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది కేవలం 5000 రూపాయలకే లభ్యం అవుతుంది.

దీనిలో 4K వీడియో, Time-lapse వీడియో, WDR వీడియో, మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఇది ఒక వాటర్ ప్రూఫ్ తొడుగుతో లభ్యం అవుతుంది. దీనిలోని tripod స్టాండ్ మన కార్, బైక్ లేదా ఏదైనా వాహనం మీద పెట్టుకుని చుట్టూ వీడియో తీయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో 128 GB వరకు expandable మైక్రో ఎస్డి సౌకర్యం కలదు. ఇక దీనిలో స్క్రీన్ టచ్ స్క్రీన్, పైగా దీనిలో వై ఫై కు అనుసంధానం చేసుకునే సౌకర్యం కలదు. అలా ఈ కెమెరా దీనికి సంబంధించిన యాప్ లో తీసిన వీడియోలను షేర్ చేయగలదు. మొత్తానికి 5000 రూపాయలకు చాలా మంచి యాక్షన్ కెమెరా అనే చెప్పాల్సి ఉంటుంది. మరి మీరు కూడా ప్రయత్నిస్తారా.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button