gold coins : బయట పడ్డ బంగారు నాణాలు !

gold coins కరోనా కాలం లో ప్రజలు డబ్బులు లేక తినడానికి అన్నం లేకున్నా ఉన్నపుడు, బంగారు నాణాలు దొరుకుతున్నాయి అంటే ఎవరైనా ఊరుకుంటారా ముష్టి యుద్దాలు చేసైనా సరే ఆ నాణాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటారు.
ఇదే జరిగింది ఆంధ్రప్రదేశ్ – తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన కృష్ణగిరి జిల్లా, హోసూర్ లోని మట్టి దిబ్బలకింద బంగారు నాణాలు ఉన్నాయని తెలవడంతో ప్రజలు ఆ ప్రాంతానికి బారులు తీరారు.
ఈ నాణాలు ఏరుకొనే సమయంలో కొందరి మధ్య యుద్దాలు జరిగి గాయాల పాలు అవుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ప్రజలని అక్కడినుడి తరిమేసినప్పటికీ, పోలీసులతో వాగ్వివాదం పెట్టుకొని మరీ ఆ నాణాలని ఏరుకుంటున్నారు.
ఆ నాణాలని గమనించిన పోలీసులు అవి ఇత్తడివి అని తేల్చారు. ఐన కానీ ఆ నాణాలని ప్రజలు వదిలి పెట్టలేదు.
ఈ పురాతన నాణాలకి బంగారం తో సమానంగా చాల విలువ ఉంటుందని చరిత్రకారులు వెల్లడించారు.