బీటెక్ విద్యార్థులకు గూగుల్ అఫర్ !

బీటెక్ విద్యార్థులకు అదిరిపోయే అఫర్ ప్రకటించిన గూగుల్ , బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికీ గూగుల్ ఇంటర్న్‌షిప్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇంజనీరింగ్ ఇంటర్న్ సమ్మర్ 2021 కోసం దరఖాస్తుల్ని కోరుతోంది.
ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, కంప్టూటర్ సైన్స్ చదువుతున్న వారై ఉండాలన్నారు . దీనితోపాటు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, సీ ప్లస్ ప్లస్, పైథాన్ తెలిసి ఉండాలి. అంతేకాకుండా ఎస్ క్యూఎల్, స్పింగ్, హైబర్ నేట్, వెబ్ సర్వీసెస్, జావా స్క్రిప్ట్ వర్క్ తెలిసి ఉండాలి. ఇంటర్న్‌షిప్ 12 నుంచి 14 వారాలు కొనసాగనుంది .
ఈ గూగుల్ ఇంటర్న్‌షిప్‌కు సెలెక్ట్ ఐన విద్యార్థులు గూగుల్ ఇంటర్నల్ బిజినెస్ అప్లికేషన్స్‌ని డెవలప్ పై వర్క్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ లో దరఖాస్తుకు చేసుకోడానికి చివరితేది 11 డిసెంబర్ 2020గా తెలిపారు .