రివ్యూ: గల్లి రౌడీ | Gully Rowdy Movie Review

Review: Gully Rowdy Movie 2021
Star Cast:- సందీప్ కిషన్, బాబీ సింహా, నేహా హరిరాజ్ శెట్టి, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి
Producers:- కొన వెంకట్ , ఎం. వి.వి. సత్యనారాయణ.
Music Director :- చౌరస్తా రామ్ , సాయి కార్తీక్
Director:- నాగేశ్వర రెడ్డి
Story:- ఈ కథ రౌడీ ఫ్యామిలీ లో పుట్టిన వాసు (సందీప్ కిషన్ ) ని చూపిస్తూ మొదలవుతుంది. వాసు కి రౌడీయిజం చేయడం అంటే ఇష్టం ఉండదు. అయినా కూడా వాసుని బలవంతంగా గ్యాంగ్ వార్ లో దింపుతారు. ఇదిలా ఉండగా వాసు ప్రేమిస్తున్న అమ్మాయి (నేహా శెట్టి ) వాసు కి రిక్వెస్ట్ చేస్తుంది. అదేంటంటే వాసు యొక్క రౌడీ బ్యాక్ గ్రౌండ్ ఉపయోగించు తన ఫామిలీ ని కాపాడు ‘ అని చెప్తుంది. ఇపుడు రౌడీయిజం అంటేనే ఇష్టం లేని వాసు , తాను ప్రేమించిన అమ్మాయికోసం రౌడీయిజం లో దిగుతాడా? అసలు నేహా శెట్టి ఫామిలీ కి ఎం అయింది ? నేహా శెట్టి ఎందుకు వాసు ని రిక్వెస్ట్ చేస్తుంది ? వీటన్నిటి మధ్య బాబీ సింహ పాత్రా ఏంటి ? ఇవ్వని తెలుసుకోవాలంటే ఈ Gully Rowdy In Theatre చూడాల్సిందే.
👍 :-
- ఎప్పటిలాగే సందీప్ కిషన్ తన స్టైల్ లో నటించి అని వర్గాల ప్రేక్షకులని ఇంప్రెస్స్ చేస్తారు . సందీప్ కిషన్ కామెడీ టైమింగ్ సూపర్ అస్సలు. నేహా శెట్టి కూడా బాగా చేసింది. అన్నిటికంటే రాజేంద్ర ప్రసాద్ కామెడీ సినిమా అంత నవ్వులు కురిపిస్తాయి. బాబీ సింహ మరియు పోసాని పర్వాలేదనిపించారు.
- కథనం.
- సెకండ్ హాఫ్ , ప్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్.
- మ్యూజిక్ బాగుంది.
- కిడ్నాప్ సన్నివేశాలు మరియు కామెడీ టైమింగ్.
- ఎడిటింగ్ బాగుంది.
- సినిమాటోగ్రఫీ కొత్తగా ఉంది.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎 :-
- రొటీన్ కథ
- మొదటి భాగం లో సన్నివేశాలు అవసరానికి మించి ల్యాగ్ చేశారు.
- బాబీ సింహ పాత్రకి హైప్ లేపడం.
ముగింపు :-
మొత్తానికి Gully Rowdy Cinema కామెడీ వరకు అయితే అందరిని నవ్విస్తుంది. కథ రొటీన్. లాజిక్స్ ఆలోచించకుండా కామెడీ కోసమే చూసేవాళ్లకి ఈ సినిమా నచ్చుతుంది. సందీప్ కిషన్ నటన మరియు కామెడీ టైమింగ్ సూపర్. అందరికంటే రాజేంద్రప్రసాద్ గారి కామెడీ టైమింగ్ సినిమా మొత్తానికి హైలైట్ అవుతుంది. నేహా శెట్టి కూడా బాగా చేసింది. మిగితా పాత్రలు ఓమాదిరి అలరించారు. మ్యూజిక్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు కామెడీ కోసమే రాసుకొని లాజిక్స్ అని పక్కన పెట్టేశారని అర్ధం అయింది. మొదటి భాగం లో బోరింగ్ సన్నివేశాలు ఎక్కువ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొత్తానికి Gully Rowdy అనే సినిమా కామెడీ కోసం అయితే చూడచ్చు కానీ కథ కోసం చూసేవారికి నచ్చకపోవచ్చు.
Rating :- 2.5 /5