HBD Kareena Kapoor Khan : హ్యాపీ బర్త్ డే కరీనా కపూర్ 41 ఏళ్ళలో కూడా దూకుడు విషయం లో తగ్గేదెలా :-

HBD Kareena Kapoor – Birthday Tribute Artical: ఈరోజు బాలీవుడ్ అందలం భామ , ఇపుడు చుసిన కుర్రాళ్ల హృదయాలను ఝలక్ మనిపించే సత్తా ఉన్న 41 ఏళ్ళ బ్యూటీ , ఆమె మన కరీనా కపూర్. ఈరోజు 41 ఏళ్ళ వయస్సులో అడుగుపెడుతున్న కూడా అందం లో కానీ , అందాలు ఆరపోయడంలో కానీ , ఫోటోషూట్స్ విషయం లో కానీ ఎవరికీ తక్కువ కాదు మరియు ఎక్కడ తగ్గేదే లేదు అని నిరూపించిన కరీనా కపూర్. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్న ప్రొఫెషన్ ప్రొఫెషన్ ఏ , పర్సనల్ లైఫ్ పర్సనల్ ఏ అని సభాముఖంగా చెప్పగలిగే గట్స్ ఉన్న ఏకైక హీరోయిన్. ఈరోజు 41 సంవత్సరం లో అడుగుపెడుతున్న సందర్బంగా ప్రముఖ సెలబ్రిటీస్ అందరు ఈ ముద్దుగుమ్మ కి ట్విట్టర్ రూపం లో విషెస్ చెప్తున్నారు.

ఇదిలా ఉండగా కరీనా కపూర్ 21 , సెప్టెంబర్ 1980 లో రణ్‌ధీర్ కపూర్ మరియు బబిత కి పుట్టిన సంతానం. కపూర్ ఫామిలీ అనే ముద్ర తో బాలీవుడ్ లో అడుగుపెట్టిన , తన నటన మరియు అందంతోనే దశాబ్ద కాలం నెంబర్ 1 హీరోయిన్ గా అగ్ర కథానాయికలకు గట్టి పోటీ ఇచ్చింది. అయితే తాను నటించిన మొదటి సినిమా రేఫుజి ప్లాప్ అయినా తన నటనకి మంచి గుర్తింపు వచ్చింది. కాకపోతే తాను సక్సెస్ చుసిన మొదటి సినిమా కభీ ఖుషి కభీ గమ్. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయి వరుస ఆఫర్స్ తో లైఫ్ బిజీ బిజీ గా గడిపేసింది.

ఇదిలా ఉండగా 2012 లో కరీనా కపూర్ తన కో-స్టార్ అయినా సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకొని దాంపత్య జీవితం కూడా చాల సంతోషంగా గడుపుతుంది.. విరి ప్రేమకు చిహ్నంగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. భర్త సైఫ్ సపోర్ట్ ఇయ్యడం తో 40 ఏళ్లలో కూడా కరీనా అందాలు ఆరబోయడం మానేయలేదు.

ఇటీవలే ఈ దంపతులిద్దరూ గోవా వెళ్లి అక్కడ బీచ్ లో కరీనా బికినీ లో దిగిన ఫోటోలు కూడా అప్లోడ్ చేసారంట అర్ధం చేసుకోవచ్చు సైఫ్ కరీనాకి ఎంత స్వేచ్ఛ ని ఇచ్చారో. దీనితో పాటు ఈ మధ్యకాలం లోనే ఒక ప్రముఖ మ్యాగజిన్ కి హాట్ ఫోటోషూట్ కూడా చేసింది.

ప్రస్తుతం తాను అమీర్ ఖాన్ తో లాల్ సింగ్ చద్ధా అనే సినిమా చేస్తుంది. ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలన్న సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.

మొత్తానికి 41 ఏళ్ళ పుట్టిన రోజు ని ఘనంగా జరుపుకుంటూ పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ హ్యాపీ గా లీడ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ కరీనా.