బెండకాయతో బోలెడు ప్రయోజనాలు..
బెండకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఇంచుమించు అన్నిదేశాల వారు ఉపయోగిస్తుంటారు. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, కెతో పాటు క్యాల్షియం, కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్, ఫైబర్ ఇంకా అనేక ఖనిజాలు ఉన్నాయి.
బెండకాయను తరచుగా తీసుకోవడం వల్ల చక్కెరవ్యాధి కూడా తగ్గుముఖం పడుతుందని పరిశోధనల్లో తేలింది. ఇందులో ఉండే విటమిన్ ఇ వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి సహజవంతమైన యవ్వనాన్ని ఇస్తుంది.ఘిది జుట్టుకు ఒక కండీషనర్‌లా పనిచేస్తుంది. ఇది వెంట్రుకల కుదుళ్లను బలోపేతం చేసి ఒత్తయిన జుట్టును తిరిగి పొందేలా చేస్తుంది.
బెండకాయ బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా ఇందులో ఉండే ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా రక్తనాళాలలో ఏర్పడ్డ కొవ్వును కరిగిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గర్భిణులు బెండకాయను తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ యొక్క నాడీవ్యవస్థ వృద్ధి చెందుతుంది. డిప్రెషన్‌ను తగ్గిస్తుంది. ఇలా అనేక ప్రయోజనాలున్న బెండకాయను ఆహారంలో తీసుకుందాం.. ఆరోగ్యంగా ఉందాం.