health tips in telugu

ఆక్రోటనులతో ఇక మీ గుండె మరింత సురక్షితం

 

ఆక్రోటను అంటే అదేంటి మేము ఎపుడు వినలేదు అనుకుంటున్నారా? వీటిని ఇంగ్లీష్ లో వాల్ నట్స్ అంటారు. ఇపుడు తెలిసిందా ఆక్రోటను అంటే. తెలుగులో ఆక్రోటను అంటారు. ఇది అతి పురాతనమైన డ్రై ఫ్రూట్. చాలా ఉపయోగాలు కలిగినది. కాని చాలా మందికి ఈ వాల్ నట్స్ మీద ఒక చెడు అపోహ ఉంది. దీనిలో కొవ్వును పెంచే పదార్దాలు ఉంటాయి అని వీటిని ఎక్కువ మంది తినరు. దీనిలో ఉన్న మంచి విలువైన పోషక పదార్దాల గురించి తెలుసుకుంటే మన అభిప్రాయాన్ని తప్పకుండా మార్చుకుంటాం. ముందుగా ఈ ఆక్రోటనులలో ఉండే విలువైన పదార్దాల గురించి తెలుసుకుందాము. వాల్ నట్స్ లో ముఖ్యంగా ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కువ లభించే అతి ముఖ్యమైన డ్రై ఫ్రూట్ వాల్ నట్స్. వాల్ నట్స్ లో ఆల్ఫా-లినోలిక్ ఆసిడ్ కూడా ఉంటుంది. ఇవి మన గుండెకు ఎంతో మేలు చేస్తాయి. వాల్ నట్స్ ని ప్రతి రోజు మన ఆహారంలో తప్పనిసరిగా  తీసుకోవాలి. మనం తీసుకునే అనేక అన్ హెల్తీ ఫుడ్స్ వల్ల మన గుండెకు ఎక్కువ హాని కలుగుతుంది. మన గుండెను మనం ఆరోగ్యంగా చూసుకోవాలి అంటే తప్పని సరిగా ఆక్రోటనులను తీసుకోవాలి. ఇవి మన గుండెలో ఉండే చెడు కొవ్వు పదార్థాలను శుభ్రం చేస్తుంది. గుండెకు అవసరమైన మంచి కొవ్వును అందిస్తుంది. రక్తపీడనాన్ని నియంత్రిస్తుంది. ముఖ్యంగా గుండెపోటు రాకుండా కాపాడుతుంది. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్స్ గుండెకు చాలా అవసరం. అవి మనకు పుష్కలంగా లభించే ఒకే ఒక డ్రై ఫ్రూట్ వాల్ నట్స్. వాల్ నట్స్ లో విటమిన్స్, మినరల్స్ ,ఆoటీ-ఆక్సిడెంట్స్ కుడా ఉంటాయి. ఒక్క గుండెకు మాత్రమే కాదు మన శరీర బరువు తగ్గడానికి , డయాబెటిస్ ని  తగ్గించడంలో, బ్రెస్ట్ కాన్సర్ తగ్గించడంలో ఇలా చెప్పుకుoటు పొతే చాలా ఉన్నాయి. సో ప్రతి రోజు ఒక స్నాక్ ఐటెం లాగా ఏడు వాల్ నట్స్ తింటే మన గుండె సురక్షితంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుండి వాల్ నట్స్ తినడo మొదలుపెట్టండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button