జుట్టు రాలడాన్ని తగ్గించి.. మిలమిలా మెరిసేలా చేసే అలోవెరా..
అలోవెరా.. దీనిని తెలుగులో కలబంద అంటారు. ఇందులో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ, బి, బి1, బి2, బి3, బి6, బి12తో పాటు కాల్షియం, పాస్ఫరస్, పొటాషియం, మాంగనీస్, ఐరన్, సోడియం, కాపర్ లాంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.
అలోవెరా జ్యూస్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు కేన్సర్ కారకాలు శరీరంలో వృద్ధి చెందకుండా ఉండేలా దోహదపడతాయి. శరీరానికి హానిచేసే ప్రీరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అలోవెరా జీర్ణక్రియలను వేగవంతం చేస్తుంది. ఇది పెద్దప్రేగును శుభ్రపరచడమే కాకుండా నిలువ ఉన్న జీవక్రియ వ్యర్థాలను శరీరం బయటకు పంపుతుంది. శరీరంలో ఏర్పడే కొవ్వును వేగంగా కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది.
ఇది శరీరానికి అవసరమైన అన్ని రకాల అమినో ఆమ్లాలను అందిస్తుంది. ఇవి కండరాల కణజాల వృద్ధికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.
జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు అలోవెరా సమృద్ధిగా కలిగి ఉంది. దీనిని తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్యలను తగ్గించుకోవచ్చు. కేశాలకు సహజసిద్ధమైన మెరుపును తీసుకువచ్చి ఆరోగ్యంతో ఉండేలా చేస్తుంది.