health tips in telugu
Munagaku: మునగాకు లాభాలు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..
మనం తీసుకునే పండ్లు తాజా కూరగాయలు, ఆకుకూరలే మన శరీరానికి శ్రీరామరక్ష. పురాతన కాలం నుంచే ఎన్నో రకాల కూరగాయలను, ఆకుకూరలను మనం ఆహారంగా తీసుకుంటున్నాం. అందులోనే మునగాకు కూడా ఒకటి. ఇది తరచుగా తీసుకునే వారికి దివ్యౌషదంగా పనిచేస్తుంది. ఉపయోగాలను పరిశీలిస్తే..
దీర్ఘకాలిక రోగాలకు మునగ బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
మునగాకు మధుమేహ వ్యాధి గ్రస్తులకు చాలా బాగా ఉపయోగపడుతంది.

మునగలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకునే లక్షణాలు ఉన్నాయి.
ఎదిగే పిల్లలకు మునగాకు చాలా మంచిది. దంతాలు ధృడంగా తయారవుతాయి.
మునగాకులో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. మాంసం తినని వారు మునగాకు తీసుకుంటే ప్రొటీన్‌లు పుష్కలంగా లభిస్తాయి.
అరటి పండ్లు కన్నా 15 రెట్లు అధికంగా పొటాషియం మనకు మునగాకు ద్వారా అందుతుంది.